Kota Bommali PS Collections: ‘కోట బొమ్మాళి పీఎస్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్..లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలయాళంలో హిట్ అయిన ‘నాయట్టు’ కి రీమేక్ గా రూపొందింది ఈ సినిమా.

‘లింగి లింగి లింగిడి’ అనే పాట సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. నవంబర్ 24న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటిరోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.13 cr
సీడెడ్ 0.06 cr
ఉత్తరాంధ్ర 0.05 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.04 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.54 cr (షేర్)

‘కోట బొమ్మాళి పీఎస్’ (Kota Bommali PS) చిత్రానికి రూ.3.04 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.30 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.0.54 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.76 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus