2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ‘జనసేన’ పార్టీని బలోపేతం చేసే పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమాల్లో నటించాను ‘అజ్ఞాతవాసి’ నే చివరి సినిమా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ‘జనసేన’ పార్టీ స్థాపించిన తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘గోపాల గోపాల’ ‘కాటమరాయుడు’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు చేశాడు. ఇక అదే టైములో కొందరి నిర్మాతలకు సినిమా చేస్తానని మాట ఇచ్చాడని ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ లిస్ట్ లో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో పాటు ఏఎం రత్నం కూడా ఉన్నాడు.
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఏ.ఎం.రత్నం స్టార్ ప్రొడ్యూసర్ అన్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ ఏ.ఎం.రత్నం కాంబోలో ‘ఖుషి’ ‘బంగారం’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రం చేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చాడట. ఆ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో సినిమా మొదలుకాబోతుందని తెలుస్తుంది. దర్శకుడు క్రిష్ వద్ద పవన్ కు సరిపడే ఓ కథ ఉందట. ఈ కథతో పవన్ సినిమా చేయాలని ఏ.ఎం.రత్నం ప్రయత్నిస్తున్నాడట. చూద్దాం మరి ఆ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో చూడాలి..!