Krishna Vamsi: హీరోయిన్ల గురించి కృష్ణవంశీ ఏమన్నారంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. జనాల్లో ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నుంచి సరైన సినిమాలు రావడం లేదు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన ‘రంగమార్తాండ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. కృష్ణవంశీ తన సినిమాల్లో హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తారు. అందుకే చాలా మంది హీరోయిన్లు ఆయన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

హీరోయిన్లను తెరపై అందంగా చూపించడంతో కృష్ణవంశీ మార్క్ వేరు. అయితే ఆయన మాత్రం హీరోయిన్ల అందం గురించి తను పట్టించుకోనని అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడారు. సినిమాల్లో హీరోయిన్లను బాగా చూపిస్తానని.. అందరూ అంటుంటారని కానీ.. సినిమాలు చేసే సమయంలో హీరోయిన్లపై పెద్దగా దృష్టి పెట్టనని ఆయన అన్నారు మామూలుగానే వారంతా అందంగా ఉంటారు కాబట్టే హీరోయిన్లుగా సినిమాలు చేస్తున్నారని.. అలాంటి వారిని అందంగా చూపించేది ఏముంటుందని అన్నారు.

కెమెరాకు అనుగుణంగా పెట్టే యాంగిల్స్ కారణంగా.. వారి అందానికి మరింత వన్నె వస్తుందని అన్నారు. ఈ విషయంలో కొందరు తనను బాపుగారితో పోల్చుతూ ఉంటారని.. ఆయన లెజండరీ డైరెక్టర్, ఆయనతో తనను పోల్చుకోలేనని అన్నారు. సినిమా హిట్టు, ప్లాప్ గురించి మాట్లాడుతూ.. తను వరుసగా సిక్సర్‌లను చూశాను.. అలాగే డకౌట్స్ కూడా చూశానంటూ చమత్కరించారు. మొదట్లో హిట్ వస్తే చాలా గర్వంగా అనిపించేదని..

ఆ తరువాత కొన్ని సినిమాలు చేసేసరికి మనదేం లేదనే విషయం అర్థమైందని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో బెస్ట్ ఫిలిం ఏదని.. ఎవరైనా అడిగితే మాత్రం ఇప్పటికీ చెప్పలేనని అన్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus