క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎన్నో గొప్ప సినిమాలు మనకి అందించారు. ఆయన హిట్ సినిమాల్లో కొన్ని పాత్రలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతాయి. రాంగోపాల్ వర్మ శిష్యుడే అయినప్పటికీ.. తన గురువుకి అసహ్యమైన ఎన్నో ఫ్యామిలీ స్టోరీలను తెరకెక్కించి సూపర్ హిట్లు అందుకున్నారు కృష్ణవంశీ. ‘నిన్నే పెళ్లాడతా’ ‘మురారి’ ‘చందమామ’ వంటివి ఈ లిస్ట్ లో ఉన్నాయి. అయితే ‘శశిరేఖా పరిణయం’ ‘మొగుడు’ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
ఇందులో ‘శశిరేఖా పరిణయం’ కొంతలో కొంత కమర్షియల్ గా కలెక్షన్స్ ను రాబట్టింది కానీ గోపీచంద్ హీరోగా నటించిన ‘మొగుడు’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా తాప్సి నటించింది. రాజేంద్ర ప్రసాద్, రోజా వంటి స్టార్ క్యాస్ట్ కూడా కీలక పాత్రలు పోషించారు. అయితే ‘మొగుడు’ లో ఓ సీన్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ సీన్ ను ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు.
ఆ సన్నివేశంలో ముందుగా రోజా ఒకరి పై చెయ్యి చేసుకుంటుంది. అతను రాజేంద్ర ప్రసాద్ అల్లుడు అవ్వడంతో.. రోజాని చాచిపెట్టి కొడతాడు రాజేంద్ర ప్రసాద్, దాంతో హీరో గోపీచంద్.. రోజాని కొడతాడు, రోజా తాప్సి తల్లి కాబట్టి గోపీచంద్ ను లాగిపెట్టి కొడుతోంది. చివరికి గోపీచంద్.. తాప్సి పై చెయ్యి ఎత్తి కొట్టకుండా ఊరుకుంటాడు’ అసలు ఇలాంటి సన్నివేశాన్ని కృష్ణవంశీ ఎలా తీసాడు అని అంతా అనుకున్నారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలానే ఉంటాయి.
దాంతో ఈ సీన్ ను ఓ నెటిజెన్ షేర్ చేస్తూ.. ‘ఈ సీన్ కి నవ్వుడే నవ్వుడు థియేటర్లో… ఎలా తీసావ్ సామి ఈ కళాఖండాన్ని’ అంటూ కృష్ణవంశీని ట్యాగ్ చేసాడు. దీనిపై స్పందించిన కృష్ణవంశీ .. ‘కదా ఏంటో స్వామీ.. థాంక్యూ గాడ్ బ్లెస్’ అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం కృష్ణవంశీ.. ప్రకాష్ రాజ్ తో ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.