Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
- February 11, 2026 / 02:41 PM ISTByPhani Kumar
‘తొలివలపు’ తో గోపీచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. తర్వాత అతనికి ఛాన్సులు రాలేదు. ఈ క్రమంలో ‘జయం’ తో విలన్ గా మారాడు. ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాల్లో కూడా విలన్ గా మెప్పించాడు. మళ్ళీ ‘యజ్ఞం’ తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ‘ఆంధ్రుడు’ చేశాడు. అది కూడా బాగానే ఆడింది. ఆ వెంటనే కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘రణం’ అనే మాస్ సినిమా చేశాడు.
Ranam
పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘ఈతరం’ ఫిలిమ్స్ బ్యానర్ పై పోకిరి బాబురావు ఈ చిత్రానికి నిర్మాత. 2006 ఫిబ్రవరి 10న అన్ సీజన్ టైంలో రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ తొలి ఆటకే పాజిటివ్ టాక్ రావడంతో తర్వాత థియేటర్లు, కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఫుల్ రన్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ ఫిబ్రవరి 10 కి ‘రణం’ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 3.81 cr |
| సీడెడ్ | 0.88 cr |
| ఉత్తరాంధ్ర | 1.22 cr |
| ఈస్ట్ | 0.71 cr |
| వెస్ట్ | 0.50 cr |
| గుంటూరు | 0.53 cr |
| కృష్ణా | 0.63 cr |
| నెల్లూరు | 0.41 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 8.69 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 2.80 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 11.49 cr(షేర్) |
‘రణం'(Ranam) సినిమా రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. పైగా అది అన్ సీజన్. అయినప్పటికీ ‘రణం’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రూ.11.49 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.3.49 కోట్ల లాభాలను బయ్యర్స్ కి అందించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు











