‘కృష్ణ వ్రింద విహారి’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

నాగశౌర్య హీరోగా షెర్లీ సెటియా హీరోయిన్ గా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ‘ఐరా క్రియేషన్స్‌’ బ్యానర్ పై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పకులుగా వ్యవహరించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదల కాబోతుంది.టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి.

దీంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 2.50 cr
సీడెడ్ 1.10 cr
ఉత్తరాంధ్ర 0.60 cr
ఈస్ట్ 0.30 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.38 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.88 cr

‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ ను అందుకోవడం ఈజీనే..! అందులోనూ సెప్టెంబర్ 23న ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా టికెట్ రేట్లు చాలా తగ్గించారు.

దీంతో ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ‘కృష్ణ వ్రింద విహారి’ కి కూడా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. బెంగళూరు వంటి ఏరియాల్లో కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. మరి టాక్ ఎలా ఉంటుందో చెప్పాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus