ఆరోజు నుంచి నాగశౌర్య మూవీ స్ట్రీమింగ్ కానుందా?

  • October 12, 2022 / 06:30 PM IST

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన కృష్ణ వ్రింద విహారి సినిమా గత నెల 23వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా స్టోరీ లైన్ అంటే సుందరానికి సినిమా స్టోరీ లైన్ కు దగ్గరగా ఉండటం కృష్ణ వ్రింద విహారికి మైనస్ అయింది. ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులకు నచ్చినా మాస్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అంటే సుందరానికి సినిమా కంటే ముందు ఈ సినిమా విడుదలై ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ వరుసగా క్రేజ్ ఉన్న సినిమాల హక్కులను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇతర ఓటీటీలకు నెట్ ఫ్లిక్స్ గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ వ్రింద విహారి సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనీష్ కృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కృష్ణ వ్రింద విహారి ఓటీటీలో కూడా సక్సెస్ సాధించాలని చాలామంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా ఛలో తర్వాత ఆ రేంజ్ హిట్ లేని నాగశౌర్య ఈ సినిమాతో గత సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ రిజల్ట్ ను అందుకున్నారు.

మరోవైపు నాగశౌర్య స్క్రిప్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తర్వాత సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలనే ఆలోచనతో కథాబలం ఉన్న చిత్రాలకు శౌర్య ఓటేస్తున్నారు. మాస్ సినిమాల కంటే క్లాస్ సినిమాలే నాగశౌర్యకు ఎక్కువగా సక్సెస్ లను అందిస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు నాగశౌర్యకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus