Krishnam Raju, Prabhas: ఆ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ అవుతాడన్న కృష్ణంరాజు!

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపైనా ప్రభాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నేటికి 20 సంవత్సరాలు కావడంతో కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభాస్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి 20 సంవత్సరాలు గడిచిపోయాయా అని అనిపిస్తోందని

గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ ద్వారా ప్రభాస్ ను హీరోగా పరిచయం చేయాలని భావించామని ఆయన అన్నారు. అయితే దర్శకుడు జయంత్ సి పరాన్జీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ ఈశ్వర్ కథ చెప్పి మమ్మల్ని ఒప్పించారని ఈశ్వర్ సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని కృష్ణంరాజు కామెంట్లు చేశారు. ప్రభాస్ తొలి సినిమా చూశాక పెద్ద హీరో అవుతాడని భావించాం కానీ పాన్ ఇండియా హీరో అవుతాడని అనుకోలేదని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

శ్రమ, పట్టుదలతో ప్రభాస్ ఈ స్థాయికి ఎదిగాడని కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రభాస్ లో ఇతరులకు సాయం చేసే గొప్ప గుణం ఉందని కృష్ణంరాజు వెల్లడించారు. ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని కృష్ణంరాజు అన్నారు. ఆదిపురుష్ తో ప్రభాస్ గ్లోబల్ స్టార్ అవుతాడని కృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణంరాజు భార్య శ్యామల ప్రభాస్ హీరో అయ్యి 20 సంవత్సరాలు అయిందంటే నమ్మకం కలగటం లేదని తెలిపారు. ప్రభాస్ కు నేనే పెద్ద ఫ్యాన్ అని శ్యామల పేర్కొన్నారు.

ప్రభాస్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటాడని శ్యామల చెప్పుకొచ్చారు. ప్రభాస్ ను చూసి చాలా గర్వపడుతున్నానని శ్యామల తెలిపారు. ప్రభాస్ మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని శ్యామల కామెంట్లు చేయడం గమనార్హం. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తర్వాత సినిమాలతో ప్రభాస్ కచ్చితంగా సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus