Brahmamudi July 31st: అప్పు తీర్చడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి!

  • July 31, 2023 / 12:44 PM IST

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కుటుంబ కథ నేపథ్యంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. సేటు పెద్ద మనుషులతో కలిసి తన అప్పు తీర్చడం కోసం కృష్ణమూర్తి ఇంటి దగ్గరికి వెళ్లి పంచాయతీ పెడతారు. ఆరు నెలలలో అప్పు చెల్లించమని, రెండు రోజులలో 50వేల రూపాయల వడ్డీ చెల్లించమని చెబుతారు.

మరోవైపు అందరూ హాల్లో కూర్చుని ఉండగా కావ్య ఇంటికి కొరియర్ వస్తుంది. కొరియర్ రాగానే కళ్యాణ్ వెళ్లి తీసుకోమని కావ్య చెబుతుంది. కొరియర్ తీసుకున్న కళ్యాణ్ వదిన ఇది మీకే వచ్చిందని చెప్పగా దానిని ఓపెన్ చేసే అర్హత మీకే ఉందని చెబుతుంది. వదిన ఇదేదో వీక్లీ మ్యాగజైన్ లాగా ఉందని చెప్పడంతో పూర్తిగా ఓపెన్ చేసి చూడండి కవిగారు ఎందుకు అంత తొందర పడతారు అని కావ్య చెబుతుంది. అయితే అందులో కళ్యాణ్ రాసిన కవిత ప్రింట్ చేయబడి ఉంటుంది. అది చూస్తున్న కళ్యాణ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.

దీంతో కుటుంబ సభ్యులందరూ అసలేం జరిగింది అని కంగారుపడగా నేను రాసిన కవిత ఇందులో ప్రింట్ అయింది. ఇదంతా కేవలం వదిన వల్లే అంటూ ఎమోషనల్ అవుతారు. ఇలా కళ్యాణ్ టాలెంట్ బయటపడటంతో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోష పడుతూ కావ్యను మెచ్చుకుంటారు. మరోవైపు జాగింగ్ వెళ్లినప్పుడు కళ్యాణ్ తన కవిత గురించి చెప్పడంతో ఇది బుక్ లో వేయించడానికి ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతుంది అప్పు. నీకి మీ అక్కకి చాలా తేడా ఉంది గాడిదలకు ఏమి తెలుసు గంధపు చెక్కలు వాసన అంటూ వెటకారంగా మాట్లాడతారు.

అంతలోపు ఒక ఆవిడ వచ్చి మీరు చాలా అద్భుతంగా కవిత రాశారు భవిష్యత్తులో గొప్ప కవి అవుతారు అంటూ ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఈమెను సెట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టావు ఏంటి అని మరోసారి వెటకారంగా మాట్లాడుతుంది అప్పు.మరోవైపు కళ్యాణ్ టాలెంట్ బయట పెట్టినందుకు రాజ్ కావ్యకు థాంక్స్ చెబుతాడు నేను మీకోసం మీ పిన్ని కోసమేం చేయలేదు. మా మరిది కోసం చేశాను అయినా నేను సాటి మనిషిగా కాకుండా సొంత మనిషిగా చేశానని చెబుతుంది.

దాంతో రాజ్ ఒకసారి పొగిడేలోపే మరోసారి తింగరి వేషాలు వేస్తావని చెబుతాడు. నీ తింగరి వేషాలు ఆపి నేను చెప్పేది జాగ్రత్తగా విను మిడిల్ క్లాస్ వారి కోసం జ్యువెలరీ డిజైన్ చేయాల్సి ఉంటుంది.రేపు క్లైంట్స్ మన ఆఫీసుకు వస్తారు. నువ్వు కూడా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. వారితో అన్ని విషయాల గురించి మాట్లాడాలి తొందరగా బయలుదేరాల్సి ఉంటుందని చెబుతాడు. మరోవైపు కృష్ణమూర్తి నా చేతకానితనం వల్లే ఇలా అప్పులు అయ్యాయనీ బాధపడతారు.

మీరు కుటుంబ బాధ్యతలను నాకు అప్పచెప్పారు. నేను వాటిని సరిగా నిర్వర్తించలేకపోయాను అంటూ కనకం మాట్లాడుతుంది. అందుకే అప్పు తీర్చడానికి ఇంటిని అమ్మేస్తాను అని చెబుతాడు మీరు ఇంటిని అమ్మేస్తే నా వల్లే ఇలా ఇల్లు కూడా కోల్పోయామన్న ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉంటుందని వీరంతా అప్పు ఎలా తీర్చాలి అన్న విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus