Krithi Shetty: సర్జరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కృతి శెట్టి!

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కృతిశెట్టి తన తదుపరి రెండు సినిమాల్లో కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇండస్ట్రీకి లక్కీ హీరోయిన్ గా మారిపోయారు. ఇలా వరుసగా మూడు సినిమాలు సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అనంతరం కృతి శెట్టి నటించిన వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్ కావడంతో గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలుకురిపించిన వారే ఇప్పుడు ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే అందం గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కృతి శెట్టి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని మరికొంత కాలం పాటు కొనసాగాలన్న ఉద్దేశంతో తన అందాన్ని రెట్టింపు చేసుకున్నారని ఈ క్రమంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా సినిమాతో పోలిస్తే ప్రస్తుత సినిమాలలో ఈమె రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై కృతి శెట్టి స్పందించారు ఈ సందర్భంగా ఈమె సర్జరీ రూమర్ల గురించి మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు ఎవరు రాస్తారో ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదని తెలిపారు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధేస్తుందని తెలియజేశారు.

ఇక తన రూపురేఖలలో మార్పు వచ్చిందనే విషయం గురించి (Krithi Shett) ఈమె మాట్లాడుతూ ఒక్కో సినిమాకు ఒక్కో పాత్రకు అనుకూలంగా హెయిర్ స్టైల్ మేకప్ ఉంటుందని అందుకే ఇలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటారని ఈ సందర్భంగా కృతి శెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వచ్చే వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus