Krithi Shetty: ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషన్లలో కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..!

  • January 11, 2022 / 10:11 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి’, జీ స్టూడియోస్’ సంస్థలు కలిసి నిర్మించిన‌ ఈ చిత్రానికి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకాబోతుంది. విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీకోసం :

ప్ర.’బంగార్రాజు’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీరు యాక్సెప్ట్ చెయ్యడానికి ఏ ఎలిమెంట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది?

జ. నా పాత్ర ఓ ఫ‌న్ ప‌టాకాలా వుంటుంది. విలేజ్ ప్రెసిడెంట్ గా కనిపిస్తాను. ఈ మూవీలో నా సంభాషణలు కొత్తగా ఉంటాయి.క‌థ విన్న‌ప్పుడు ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. మొదట నవ్వొచ్చింది. ప్రేక్ష‌కులకి కూడా అదే ఫీల్ కలుగుతుందని అనిపించింది. క‌నుక‌నే నేను ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నా.

ప్ర.నాగార్జున గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

జ. నాగార్జున సార్‌తో సినిమా అంటే మొదట కొంచెం టెన్షన్ పడ్డాను. అంత పెద్ద స్టార్.. ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్స్ వచ్చాయి. కానీ ఆయన తోటి ఆర్టిస్ట్ లను రిసీవ్ చేసుకునే విధానం, హుందాత‌నం చూసి ఏంటి సార్ ఇంత సింపుల్ గా ఉంటారా అని ఆశ్చ‌ర్య‌పోయాను. నేను కొత్త నటిని అని కాకుండా ఓ టీమ్‌ మేట్‌లా ట్రీట్ చేశారు.

ప్ర.’ఉప్పెన’ సక్సెస్ ను ఎలా తీసుకుంటారు?

జ. అది పూర్తిగా ప్రేక్ష‌కుల‌ విజయం. అయితే బేబ‌మ్మ‌గా ప్రేక్షకులు నన్ను బాగా ఓన్ చేసుకున్నారు.

ప్ర.తెలుగు ఇంత ఫాస్ట్ గా ఎలా నేర్చుకున్నారు?

జ. ‘ఉప్పెన’ టైంకి కొద్దిగా తెలుసు. అటు తర్వాత తెలుగు సినిమాలు చూడ‌డం, రెగ్యుల‌ర్‌గా నా టీమ్‌తో తెలుగులోనే మాట్లాడ‌డం అలవాటు చేసుకున్నాను. దాంతో బాగా అలవాటైంది.కొంతమంది తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకోవచ్చు కదా అని సూచించారు. కానీ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు.నాకు నా గొంతు పెద్దగా న‌చ్చ‌దు. కాన్ఫిడెన్స్ వచ్చాక చూద్దాం అన్నాను.

ప్ర.’బంగార్రాజు’ .. ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కదా. అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రెజర్ ఏమైనా ఫీలయ్యారా?

జ.నేను ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ 2020లోనే చూశాను.కాబట్టి నాకు ప్రెజర్ అనిపించలేదు. కానీ ఆ సినిమాలో కామెడీ నాకు బాగా న‌చ్చింది. తెలుగు రాక‌పోయినా ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయ్యింది. బాగా ఎంజాయ్ చేశాను.

ప్ర. రమ్యకృష్ణ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

జ.ర‌మ్య‌కృష్ణ‌ మేడం తో నాకు కాంబినేష‌నల్ సీన్స్ పెద్ద‌గా లేదు. కానీ సెట్స్ లో ఆమెను కలుసుకున్నప్పుడు చాలా విషయాలు చెప్పేవారు. ‘ఏడుపు సీన్ చేస్తే దాన్ని ఇంటికి తీసుకువెళ్ల‌కూడ‌దు. ఇక్క‌డే మ‌ర్చిపోవాలి’ అనేవారు.

ప్ర. ఏడుపు సీన్స్ చేసేప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

జ.అలా అని కాదు.. నేను గ్లిజ‌రిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేయగలను. క్యారెక్టర్ బిహేవియర్ ఎలా అయితే అలా వెంటనే చేసేస్తాను.

ప్ర.పాత్రల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

జ.నేను ఇప్ప‌టివ‌ర‌కు 6 పాత్ర‌లు చేశాను. ఒకదానితో ఒకటి సంబంధం ఉండవు. కెరీర్ ప్రారంభంలోనే నాకు దొరకడం ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది.క‌థ‌లు వింటున్నప్పుడే అవి నాకు సెట్ అవ్వకపోతే వ‌ద్ద‌నుకుంటాను. నటిగా నన్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళే పాత్రల్నే నేను ఎంపిక చేసుకుంటాను.

ప్ర. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాత్రల్ని రిజెక్ట్ చేశారు?

జ. ఇప్పుడు అవి ఎందుకు లెండి.(నవ్వుతూ)

ప్ర.’శ్యామ్ సింగ రాయ్’ లో బోల్డ్ సీన్స్ లో చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనిపించింది?

జ. ‘శ్యామ్ సింగ‌రాయ్‌’లో నాది చాలా చిన్న పాత్ర. అందులో బోల్డ్ సీన్స్ కూడా చేశాను. నా పాత్రని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే టెన్షన్ నాకు ఉంది. కానీ ఆ పాత్రని కూడా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకోవడంతో హ్యాపీ అనిపించింది.

ప్ర.సంక్రాంతి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?

జ.మా నేటివ్ ముంబై అయినప్పటికీ క‌ర్నాట‌క‌లో ఎక్కువగా పెరిగాను.సో నాకు సంక్రాంతి గురించి పెద్ద‌గా తెలీదు. దీపావ‌ళి అయితే బాగా తెలుసు. అమ్మ‌మ్మ ఇంటికి వెళ్తే.. అక్క‌డి ప‌రిస్థితిని బ‌ట్టి పండుగ‌లు జరుపుకుంటాము. ఈ మూవీ షూటింగ్ టైములో సంక్రాంతి పండుగ‌ గురించి ఎక్కువ డిస్కషన్స్ వచ్చాయి.పండక్కి సినిమాని ఇక్కడి ఇక్కడి జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలిసింది.

ప్ర.మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏంటి?

జ.ఇంద్ర‌గంటి మోహ‌న‌ కృష్ణ గారి డైరెక్షన్లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేశాను. నితిన్ తో ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’, రామ్ గారితో ఓ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాను.ఒక విమెన్ సెంట్రిక్ మూవీ కూడా డిస్కషన్ స్టేజిలో ఉంది. దాని డీటైల్స్ త్వరలో వెల్లడిస్తాను. ప్రస్తుతానికైతే ‘బంగార్రాజు’ చూసి ఎంజాయ్ చేయండి..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus