Krithi Shetty: అలాంటి పాత్రతో కృతి మెప్పించడం సాధ్యమేనా?

  • September 12, 2022 / 08:25 PM IST

తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో కృతిశెట్టి ఒకరు. గ్లామర్ రోల్స్ కంటే అభినయ ప్రధాన పాత్రల్లోనే కృతిశెట్టి ఎక్కువగా నటించారు. ఈ నెల 16వ తేదీన సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా థియేటర్లలో రిలీజవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సమ్మోహనం సినిమా పోలికలు కనిపిస్తున్నా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాగచైతన్య కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కృతిశెట్టి పాత్ర గురించి ఒక విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కొంత సమయం పాటు కృతిశెట్టి ఆత్మ పాత్రలో కనిపించనున్నారని బోగట్టా. చైతన్య సినిమాలో కృతిశెట్టి ఇలాంటి పాత్రలో కనిపిస్తారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

అయితే కృతిశెట్టి కొన్ని ఎక్స్ ప్రెషన్లను అద్భుతంగా పలికించలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. చైతన్య వెంకట్ ప్రభు కాంబో సినిమాతో ఆ విమర్శలకు కృతిశెట్టి చెక్ పెడతారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో చైతన్య కృతిశెట్టి కాంబోలో మరో సక్సెస్ చేరినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలోని ఆఫర్లతో కృతిశెట్టి బిజీ అవుతున్నారు.

కృతిశెట్టి ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు. కృతిశెట్టి పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ విషయంలో కృతిశెట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు కృతిశెట్టి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus