ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కృతి శెట్టి ఒకరు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమెకు ఈ మధ్యకాలంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇలా గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నటువంటి ఈమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టారు.
ఇలా కెరియర్ పరంగా కృతి శెట్టి బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గత వారం రోజులుగా ఈమె పెళ్లి చేసుకోబోతుందని మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. మొదటి సినిమాతోనే ఈమె మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ప్రేమలో పడ్డారని వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతూ కెరియర్లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ప్రేమ విషయాన్ని బయట పెట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ విధంగా కృతి శెట్టి కూడా మెగా ఇంటికి కోడలు కాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై తాజాగా కృతి శెట్టి టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా కృతి శెట్టి టీం ఈమె పెళ్లి వార్తల గురించి స్పందిస్తూ కృతి శెట్టి పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.
ఈమె (Krithi Shetty) ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టారని పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు అంటూ తెలియచేశారు. ఇక ఈమె పెళ్లి చేసుకోబోతుందని మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవమని ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వడంతో కృతి పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.