ఆ భామ కోపానికి కారణం!!!

సినీ పరిశ్రమ అంటేనే అవకాశం కోసం ఎదురు చూడటం, అవకాశం రాగానే దొరికినంత దోచుకోవడం, వెళ్లిపోవడం అన్నట్లుగా తయారయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే… సినిమా పరిశ్రమలో కీలకమైన నిర్మాత కేవలం క్యాషియర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటలకు విలువ తగ్గిపోవడంతో చేసేది ఏమీలేక కోట్లు పడేసి..చిల్లర ఏరుకుంటున్నాడు. ఇక నిర్మాత అమాయకత్వాన్ని ఉపయోగించుకుని పనులు పూర్తి చేసుకోవాలని చూసిన ఒక హీరోయిన్…ఇంతకీ ఎవరా హీరోయిన్?ఏమా కధ అంటే…ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస మూవీలను చేస్తున్న కృతి సనన్, తన చెల్లెలు ’నుపుర్’ని సైతం ఇండస్ట్రీలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

అదే క్రమంలో బాగా ఆలోచించి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్ తో చెల్లలి వ్యవహారాన్ని మాట్లాడింది. ఓ యంగ్ హీరో మూవీలో హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వాలని కృతి సనన్, ఆ ప్రొడ్యూసర్ ని కోరింది. అందుకు ఆ ప్రొడ్యూసర్ కూడా ఓకే చెప్పి,  కృతి సనన్ చెల్లెలు నుపుర్ తో ఓ హాట్ ఫోటోషూట్ చేయించాడు. ఇక దొరికిందే అవకాశంగా కాస్త అతిగా అసభ్యకమైన సంభాషనలు కూడా చేశాడట. తాజాగా టాలీవుడ్ లో ఈ విషయం హాట్ హాట్ గా మారడంతో ఈ విషయం అటు తిరిగి..ఇటు తిరిగి..కృతి సనన్ చెవులో పడింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ సుందరి  వెంటనే ఆ నిర్మాతకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందంటా. మరి ఆ నిర్మాత ఎవరు..ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. చూద్దాం ఎవరో ఆ నవమన్మధుడు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus