Kriti Sanon: ఆదిపురుష్ పై అంచనాలు పెంచిన కృతి.. ఏం చెప్పారంటే?

ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో ఆదిపురుష్ సినిమా ఒకటి కాగా ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడి రోల్ లో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తుండటంతో ఆదిపురుష్ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా కృతి సనన్ మాట్లాడుతూ ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని అన్నారు.

ఆదిపురుష్ మూవీ వేరే లెవెల్ లో ఉంటుందని కృతి సనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జూన్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. షెహజాదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ ఈ కామెంట్లు చేశారు. సీత రోల్ తనకు కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతుందని కృతి సనన్ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అయితే తాను రామానంద్ సాగర్ రామాయణాన్ని చూడలేదని కృతి పేర్కొన్నారు. ఆదిపురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల్లో రామాయణం గురించి అవగాహన పెరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు అయితే ఉండనున్నాయని తెలుస్తోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. ఈ సినిమా విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో మార్పులు చేశారని తెలుస్తోంది.

వరుస ప్రాజెక్ట్ లలో నటించిన ప్రభాస్ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.తన సినీ కెరీర్ లో మాస్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ లో రాముని పాత్రలో కనిపించనున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus