Kriti Sanon: కృతి సనన్‌ మనసులో కోరికలు ఇవే

కోరికలు, కలలు లేని వారెవరు ఉంటారు.. దీనికి సినిమాలు జనాలు అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే సాధారణ జనాలు కన్నా సెలబ్రిటీలకే ఎక్కువ కోరికలు ఉంటాయి. జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో శ్రమించి, ఓ స్థాయి వచ్చి ఉంటారు. అయినప్పటికీ విశ్రమించకుండా ఇంకా ఏదో సాధించాలని చూస్తూ ఉంటారు. ఏదైనా సందర్భంలో ‘మీ మనసులోని ఓ మూడు కోరికలు’ చెప్పండి అంటే.. చిట్టా విప్పుతుంటారు. అలా ఈ మధ్య కృతి సనన్‌ని అడిగితే లిస్ట్‌ చెప్పింది.

కృతి మీ మనసులోని ఆ మూడు కోరికలు/కలలు చెప్పండి అంటే… ఇలా చెప్పుకొచ్చింది. మొదటిది పెద్ద బంగ్లా, అందులో అంత కంటే పెద్ద గార్డెన్, అందులో ఉదయాన్నే టీ తాగుతూ హాయిగా సేదతీరాలి. ఇక రెండోది స్కై డైవింగ్. ఆ మజాని ఆస్వాదించాలని ఎప్పటి నుండో అనుకుంటోందట. ఆఖరిగా మూడోది జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం. దాంతో పాటు చరిత్రలో నిలిచిపోయిన మహా మనిషి బయోపిక్​లో నటించడం. ఈ మూడు కోరికలు అనుకోండి, లక్ష్యాలు అనుకోండి..

ఏదైనా సరే త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చింది కృతి. ఆమె కోరికలు నెరవేరాలని మనమూ కోరుకుందాం. అన్నట్లు కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’లో సీతగా కనిపించబోతోంది. ఇది కాకుండా అక్షయ్ కుమార్‌తో ‘బచ్చన్​పాండే’ లో నటిస్తోంది. దాంతోపాటు ‘మిమీ’, టైగర్ ష్రాఫ్​తో ‘గన్​పథ్’, ‘భేడియా’ చిత్రాల్లో నటిస్తోంది కృతి.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus