కృతి శెట్టి చేసిన ఈ యాడ్స్‌ చూశారా?

కృతి శెట్టికి ‘ఉప్పెన’ తొలి సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రచార చిత్రాల్లో ఆమెను చూసింది మొదలు ఈ ముఖాన్ని ఎక్కడో చూశామే అనిపిస్తూ వచ్చింది. ఏ రెండు మూడు యాడ్స్‌ కనిపించింది అని కూడా అనిపించి ఉంటుంది. ఈ విషయంలో మొన్నామధ్య కృతి వాళ్ల తల్లి క్లారిటీ ఇచ్చేశారు. తమ కుమార్తె సినిమాల్లోకి వచ్చే ముందు కొన్ని యాడ్స్‌లో నటించిందని చెప్పుకొచ్చారు. ఇంకేముంది మన కుర్రకారు ఆమె యాడ్స్‌ గురించి తెగ వెతికేస్తున్నారు. దీంతో అప్పుడెప్పుడో టెలీకాస్ట్‌ అయిన యాడ్లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె ఏయే యాడ్స్‌ చేసిందో చూసేద్దాం. ‘ఉప్పెన’లో బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది కృతి శెట్టి. మొదటి సినిమానే అయినా, ఎలాంటి బెరుకు లేకుండా అద్భుతంగా నటించిందని అభిమానులు, విమర్శకులు అంటున్నారు. అయితే, కృతి చాలా చిన్నతనంలోనే కెమెరా ముందుకు వచ్చింది. స్కూల్‌కెళ్లే వయసులోనే ఓ వస్త్ర దుకాణాల వాణిజ్య ప్రకటనలో నటించింది. ఆ తర్వాత ‘లైఫ్‌బాయ్‌’, ‘డైరీమిల్క్‌ చాక్లెట్‌’తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్‌లో నటించింది.

అంతేకాదు బేబమ్మ రెండేళ్ల క్రితమే వెండితెర మీద కనిపించింది కూడా. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా 2019లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘సూపర్‌ 30’లో కృతి శెట్టి ఓ సీన్‌లో కనిపించింది. అదన్నమాట సంగతి. మరి ఇంత చెప్పుకున్నాం కదా.. ఆ యాడ్‌లు కూడా చూసేద్దాం.

1.

2.

3.

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus