Kubera: కుబేరతో రిస్క్ తప్పట్లేదు.. ఏమవుతుందో..!

శేఖర్ కమ్ముల (Sekhar Kammula)  దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం కుబేరకి (Kubera) విడుదల తేదీపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 21న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శేఖర్ కమ్ముల కాస్త విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకోవడంతో పాటు ధనుష్ (Dhanush) , నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్నా (Rashmika Mandanna) , జిమ్ సర్బా (Jim Sarbh) వంటి భారీ తారాగణాన్ని ఈ ప్రాజెక్టులో భాగం చేయడంతో సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

Kubera

ఫస్ట్ గ్లింప్స్ వీడియోతోనే కుబేర సినిమాకు బజ్ పెరిగింది. బిచ్చగాడి పాత్రలో ధనుష్, కోటీశ్వరుడిగా జిమ్ సర్బా కనిపించనున్నారు. వారి పాత్రల మధ్య వచ్చే క్లాష్ కంటెంట్‌కు మెయిన్ హైలైట్ అని చెబుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, ఫిబ్రవరి నెలలో విడుదల అనేది కొంత రిస్క్‌తో కూడుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ టైమ్ లో ఎగ్జామ్స్ కారణంగా థియేటర్లకు ఆడియెన్స్ తక్కువగా వచ్చే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇకపోతే, ఫిబ్రవరి సమయాన్ని ఎంచుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఒకవైపు సమ్మర్ సీజన్‌కు పెద్ద సినిమాలు బుక్క్ అయిపోవడంతో, ఫిబ్రవరి టైమ్‌లో కుబేరను విడుదల చేయడం కంటెంట్‌పై పెట్టుకున్న నమ్మకమే అని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. అలాగే ఓటీటీ డీల్స్ వల్ల ఆ డేట్ మరో కీలక అంశంగా మారిందని సమాచారం.

శేఖర్ కమ్ముల గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే, ఇది మరీ అంత పెద్ద రిస్క్ కాదని ఉండదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే కథలలో కమ్ముల ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఆయన హ్యాపీ డేస్ (Happy Days), అనంద్ (Anand), ఫిదా (Fidaa) వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించగలిగారు. మొత్తానికి, రిస్కీ టైమ్‌లో కుబేర విడుదల చేస్తే కంటెంట్ బలంగా ఉంటే తప్పక విజయం సాధించగలదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus