కెజిఫ్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ “కురుక్షేత్రం 3D”

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడు గా నటించిన కురుక్షేత్రం, తాజా గా విడుదలైన సంగతి తెలిసిందే, త్రీడీ లో తొలిసారిగా రూపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు, ఇక కన్నడనాట ఈ సినిమా తొలి రోజు వసూళ్లు భారీ స్థాయి లో ఉన్నాయి. కన్నడ లో ఆల్రెడీ రికార్డు సెట్ చేసిన స్టార్ హీరో యాష్.. కెజిఫ్ తొలి రోజు కలెక్షన్స్ ని దర్శన్ కురుక్షేత్రం తో బ్రేక్ చేసాడు. ఈ సినిమాతో తెలుగు లో కూడా తన మార్కెట్ ఓపెన్ చేసాడు దర్శన్. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో 25 నిమిషాలు ట్రిమ్ చేశారు. తెలుగు ఆడియన్స్ కి ఈ విజువల్ వండర్ ని ఇవ్వడం లో త్రివిక్రమ్ సాయి కీలక పాత్ర పోషించారు. తెలుగు లో కురుక్షేత్రం కలెక్షన్స్ ప్రస్తుతం స్టడీ గా ఉన్నాయి. కన్నడ లో మాత్రం ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా అఖిల్‌గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ న‌టించ‌గా ద్రౌప‌దిగా స్నేహ న‌టించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వ్వ‌డం విశేషం. మెట్ట‌మెద‌టిసారిగా ప్ర‌పంచంలోనే మైతలాజికల్ 3డి వెర్ష‌న్ గా ఈచిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రానికి తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి సౌత్ ఇండియా సెన్సేషనల్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన రాక్‌లైన్‌ వెంక‌టేష్‌గారి స‌మ‌ర్ప‌ణ‌లో, వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై ఎన్నోచిత్రాలు క‌న్న‌డ‌లో నిర్మించిన మునిర‌త్న (ఎంఎల్ఎ) ఈ చిత్రాన్ని నిర్మించమే కాకుండా ఈ చిత్ర క‌థ‌ని అందించారు. నాగ‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus