Jyothi Raj: జానీ మాస్టర్ కేసు.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ (Jani Master) కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువమంది జానీ మాస్టర్ పై విమర్శలు చేస్తుండగా కొంతమంది మాత్రం జానీ మాస్టర్ వెర్షన్ కూడా విన్న తర్వాతే ఈ వివాదం విషయంలో తప్పెవరిదో తేలుతుందని చెబుతున్నారు. ఈ వివాదం వెనుక షాకింగ్ ట్విస్టులు ఉన్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం. జానీ మాస్టర్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Jyothi Raj

బెంగళూరులో ప్రత్యేక పోలీస్ బృందం జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్, ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ (Jyothi Raj) మాత్రం పరోక్షంగా ఈ కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో చాలామంది ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారని నేను చాలామంది అమ్మాయిల గురించి ఈ వీడియో చేయడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

అబ్బాయిలు అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలని జ్యోతిరాజ్ అన్నారు. అయితే కొందరు మాత్రం చట్టాల ద్వారా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లను సైతం శిక్షించాలని జ్యోతిరాజ్ తెలిపారు. ఎవరి గురించి అయినా ఆరోపణలు వస్తే ఇద్దరి వైపులా విని మాట్లాడాలని పాపులర్ వ్యక్తి అని వ్యూస్ కొరకు ఇష్టానుసారం మాట్లాడకూడదని ఆమె అన్నారు.

తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని జ్యోతిరాజ్ పేర్కొన్నారు. జ్యోతిరాజ్ కామెంట్ల గురించి నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. జానీ మాస్టర్ కు సపోర్ట్ చేయట్లేదు కానీ ఆయన చెప్పేది కూడా వినాలని కోరుతున్న జ్యోతి మాటల్లో న్యాయం ఉందని చెప్పవచ్చు.

విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus