ఒకప్పటి స్టార్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు అంటే ఎక్కువగా తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలే చేస్తారని అంతా భావిస్తున్నారు. నిజానికి ఇది చాలా వరకు కరెక్ట్. కానీ కొంతమంది మాత్రం తల్లి, అత్త, వదిన వంటి పాత్రలు చేయమని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అందులో మొన్నటి వరకు విజయశాంతి మాత్రమే ఉందని అంతా అనుకున్నాం.’రాజా ది గ్రేట్’ వంటి సినిమాలో తల్లి పాత్ర వస్తే ఆమె చేయలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ లో ప్రొఫెసర్ భారతి వంటి పాత్రనే ఆమె చేసింది.
అది తల్లి పాత్రకు దగ్గరగా ఉండదు. కానీ ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ వస్తుంది. అలాంటి ప్రాముఖ్యమైన పాత్రలు చేయడానికి మాత్రమే ఆమె మక్కువ చూపిస్తున్నట్టు గతంలో చెప్పుకొచ్చింది. ఇదే లిస్ట్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా కూడా ఉంది. ఈమె 16 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల కార్తి హీరోగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్దార్’ చిత్రంతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె సమీరా థామస్ అనే జర్నలిస్ట్ పాత్రను పోషించింది.
తన కొడుకులాగా ఎవ్వరూ అనారోగ్యం పాలవ్వకూడదు అని కార్పొరేట్ సంస్థలకు ఎదురుతిరిగి సర్దార్ అనే రా ఏజెంట్ ను ఇండియాకి రప్పించడానికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెడుతుంది. ఈ పాత్ర ఆమెకు చాలా బాగా నచ్చిందట. ఈ చిత్రానికి ముందు ఈమెకు తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలు వచ్చాయట. కానీ అవి చేయడం ఈమెకు నచ్చలేదు.
అందుకే వెయిట్ చేసి చేసి ఇలాంటి పాత్రలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమెకు తమిళంలో ‘సర్దార్’ లాంటి పాత్రలే వస్తున్నట్టు తెలియజేసింది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!