Lakshmi Parvathi: జూనియర్ పొలిటికల్ ఎంట్రీ పై లక్ష్మీ పార్వతి కామెంట్స్

ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నాడు. నందమూరి ఫ్యామిలీలో ఉన్న పెద్ద స్టార్ హీరో అంటే ఎన్టీఆరే.. అందులో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్… సినిమాల్లో ఇంకా రాణించే అవకాశాలు ఉన్నాయి. అందుకు ఆర్.ఆర్.ఆర్ సినిమాని పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. కాబట్టి… ఎన్టీఆర్ ఇలాంటి మంచి రోజులను వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చి మాటలు పడగలడా..! 2009 లో ఎన్టీఆర్.. టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేశాడు.

చాలా బాగా చేశాడు కూడా..! ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్ బెడ్ పై పడుకుని మరీ ప్రచారంలో పాల్గొన్నాడు. టీడీపీకి ఆ టైంలో ఈ ప్రచారం బాగానే ఉపయోగపడింది. జనాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై.. ముఖ్యంగా టీడీపీ అభిమానుల్లో.. గట్టి నమ్మకం కూడా ఏర్పడింది. టీడీపీ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు తప్ప వాక్చాతుర్యం కలిగిన నేతలు లేరు అనేది టీడీపీ అభిమానుల నమ్మకం. అందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఛాన్స్ దొరికిన ప్రతీసారి రచ్చ చేస్తున్నారు.

అయితే జూనియర్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఏ పని అవ్వదు అంటున్నారు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి. జూనియర్ కు రాజకీయాల్లోకి అడుగు పెట్టే ఆలోచన ఉంటే.. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చి జగన్ లా ఓ రెండు, మూడేళ్ల పాటు జనాల్లో తిరిగితే.. 2029 లో వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఉంటుంది.

ఇప్పుడైతే అతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటున్నారు లక్ష్మీ పార్వతి. ప్రస్తుతం ఈమె వైసీపీ నాయకురాలిగా.. పార్టీకి మద్దతు పలుకుతూ అనుకూలంగా మాట్లాడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus