ఆకట్టుకుంటున్న ‘భీమ్లా నాయక్’ వీడియో సాంగ్ ప్రోమో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో మూడవ పాటని కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది.

‘లాల భీమ్లా’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన ప్రోమోని ‘ది సౌండ్ ఆఫ్ భీమ్లా’ పేరుతో విడుదల చేశారు. చూస్తుంటే ఇది సాంగ్ ప్రోమోలా ఏమాత్రం అనిపించడం లేదు. మరో గ్లిమ్ప్స్ ను విడుదల చేసిన మాదిరి అనిపిస్తుంది. ఎందుకంటే ఎద్దుల బండి పై ఉన్న కొన్ని బస్తాలు క్రింద పడటం.. వాటిలో మధ్యలో నుండీ భీమ్లా నాయక్ అలియాస్ పవన్ కళ్యాణ్ పైకి లేవడం… అటు తర్వాత ‘నాగరాజు గారు మీకు హార్టీ కంగ్రాట్యులేషన్స్ అండి.

మీకు దీపావళి ముందుగానే వచ్చేసిందండీ’ అంటూ అతను డైలాగ్ చెప్పడం ఆ వెంటనే సుమో ఎగిరి పక్కనే ఉన్న డానియల్ శేఖర్ అలియాస్ రానాని భయపెట్టడం.. వంటివి మంచి మాస్ అప్పీల్ తో ఉంది కాబట్టి..! చూస్తుంటే గత రెండు రోజులుగా యూట్యూబ్లో దూసుకుపోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్ప్స్ కు ‘భీమ్లా సాంగ్’ ప్రోమో బ్రేకులు వేసేట్టే ఉందని పవన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus