టాలీవుడ్ స్టార్ హీరోలకు కొత్త కార్లు అంటే ఆసక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ కార్లను ఎంతగానో ఇష్టపడతారు. ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఇప్పటికే పదుల సంఖ్యలో కార్లు ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్న కార్లలో ఒకటైన లంభోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ను కొనుగోలు చేశారు. దేశంలోనే మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కు తారక్ యజమాని అయ్యారు.
ప్రస్తుతం ఈ కారు ఆన్ రోడ్ ధర 3.15 కోట్ల రూపాయల నుంచి 3.43 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది. కారుకు భారీస్థాయిలో డిమాండ్ ఉండటంతో ఆలస్యంగా ఆ కారు ఎన్టీఆర్ ఇంటికి డెలివరీ అయింది. అయితే ఇంటికి డెలివరీ అయిన కారును చూసి ఎన్టీఆర్ స్టన్ అయ్యారని ఎన్టీఆర్ కే ఆశ్చర్యాన్ని కలిగించేలా ఆ కారులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తో కలిసి కారు ముందు ఫోటోలకు ఫోజులివ్వగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా ఎన్టీఆర్ కార్లకు 9999 అనే నంబర్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ కారుకు కూడా అదే నంబర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన యంగ్ టైగర్ అతి త్వరలో కొరటాల శివ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
1
2
3
4
5
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!