తారక్ కార్ల పిచ్చి గురించి చెప్పాలంటే… ఆయన గ్యారేజీలో ఎన్ని కార్లున్నాయో ముందు చెప్పాలి. ఎందుకంటే తారక్ గ్యారేజీలో సుమారు 20 కార్లు ఉంటాయని అంచనా. తాజాగా కొత్త కారు ఆ గ్యారేజీలో చేరింది. అదేదో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఇటీవల దేశంలో లాంచ్ అయిన స్పెషల్ కారు లంబోర్గిని ఉరుస్. ఇందులో ప్రత్యేకమైన గ్రాఫైట్ క్యాప్సుల్ ఎడిషన్ కారును ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆ కారు ఎన్టీఆర్ ఇంటికి చేరిందట. ఈ నేపథ్యంలో ఆ కారు ధర ఎంత, ఫీచర్లేంటో చూద్దామా?
లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారు ధర సుమారు ₹3.16 కోట్లు. ఆ కారు బెంగళూరు నుంచి ఆయన ఇంటికి వచ్చినట్లు ఆటోమోబిలిఆర్డెంట్ అనే కార్ల సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఇండియాలో లాంచ్ అయిన తొలి రోజే ఈ కారును తారక్ బుక్ చేసుకున్నాడు. ఇటలీకి చెందిన ఫోక్స్‌వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ‘లంబోర్ఘిని’ ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఈ కార్లను తీసుకొచ్చింది. మన దేశంలో సోమవారం అధికారింగా లాంచ్ చేసింది.
ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో ఈ లంబోర్గిని ఉరుస్‌ను తయారు చేశారు. ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్ ఫీచర్లతో రూపొందిందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. ఇందులో ఆటో సెన్సర్స్ ఉండటంతో ఎదురుగా వాహనాలు వస్తే అలర్ట్ చేస్తుందట. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, డోర్‌లు అంత ఈజీ తెరచుకోవట. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
1
2
3
4
5
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!