Raashi Khanna: రాశీకి ఆ హిట్టు సెంటిమెంట్ కలిసొస్తుందా..?

నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మనం’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రాశీ ఖన్నా. అయితే ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారింది ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో..! అందం, అభినయం కలిగిన రాశీ ఖన్నా .. ఎంత కష్టపడినా ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘పక్కా కమర్షియల్’ ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించింది.

కానీ సక్సెస్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో రాశి నటించిన ‘థాంక్యూ’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విజయం సాధించడం చైతన్యకి ఏమో కానీ రాశీఖన్నా కి మాత్రం చాలా కీలకం అని చెప్పాలి. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న తెలుగు సినిమా ఇదే. దిల్ రాజు నిర్మాత కాబట్టి సినిమా బాగుంటుంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో జనాలు థియేటర్లకు రాకపోవడం ఆందోళన కలిగించే విషయం.

అయితే రాశీ ఖన్నా… చైతన్య లది ఓ విధంగా హిట్ పెయిర్ అనొచ్చు. వీరు ‘మనం’ సినిమాలో జత కట్టారు. ఆ సినిమాలో రాశి కనిపించేది 5 నిమిషాలు మాత్రమే అయినా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ‘వెంకీ మామ’ లో కూడా వీరు జంటగా నటించారు. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. కాబట్టి ఈసారి కూడా ఈ కాంబినేషన్ లో హిట్ పడే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాకి రాశీ ఖన్నా పాత్ర చాలా ముఖ్యమని చిత్ర బృందం పదే పదే చెబుతుంది. కాబట్టి ‘థాంక్యూ’ కనుక హిట్ అయితే రాశీ ఖన్నా మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హిట్ అవ్వకపోతే .. ఇక ఈమె టాలీవుడ్ లో రాణించడం కష్టమనే చెప్పాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus