ఈసారినా సరిగా ప్లాన్ చేసుకుంటుందో లేదో!
- January 16, 2019 / 02:03 PM ISTByFilmy Focus
హీరోయిన్ గా “కృష్ణగాడి వీరప్రేమగాధ” లాంటి సూపర్ హిట్ తో ఎంట్రీ ఇవ్వడమే కాక పరిచయ చిత్రంతోనే నటిగానూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహరీన్ అనంతరం సెకండ్ సినిమా ఛాన్స్ దక్కించుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మడికి హిట్ దొరకడానికి మాత్రం మూడేళ్లు పట్టింది. వరుసబెట్టి సినిమాల్లో నటిస్తూ వచ్చినా మొన్న విడుదలైన “ఎఫ్ 2” తప్పితే అమ్మడికి మరో హిట్ లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమా కాదు కదా కనీసం చెప్పుకోవడానికి అంటూ ఒక్క సినిమా కూడా లేదు.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పుడు “ఎఫ్ 2″తో మంచి హిట్ అందుకుంది కాబట్టి.. ఇకనైనా కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని, రెమ్యూనరేషన్ కు మాత్రమే కాక కథ-కథనాలకు కూడా కాస్త వేల్యూ ఇవ్వాలని ఆమె పరిచయస్తులు ఆమెకు సూచనలిస్తున్నారు. మరి మెహరీన్ ఆ సూచనలు పాటించి ఇప్పుడైనా తన కెరీర్ ను గాడిలో పడేసేలా ప్లాన్ చేసుకుంటుందో లేక ఎప్పట్లానే లైట్ తీసుకొని మళ్ళీ ముందు తిరిగి వెళ్లిపోతుందో చూడాలి.













