ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారట..!

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ … అగ్ర హీరోలందరితో సినిమాలు చేసి హిట్లు ఇచ్చాడు. అయితే అయన ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూశారట. ఇంతకీ ఆ కోరిక ఏంటి అనే గా మీ ప్రశ్న…?ఏమీ లేదండీ…. నందమూరి బాలకృష్ణతో ఎన్నో హిట్ సినిమాలు తీసిన కోడి రామకృష్ణ ‘విక్రమసింహా’ అనే చిత్రాన్ని ప్రారంభించి.. సగం సినిమాను పూర్తి చేసి.. ఆ తరువాత మధ్యలోనే నిలిపివేశారట. దీనికి అసలు కారణం ఈ మద్యే వెలుగులోకి వచ్చింది.

దీనికి అసలు కారణాన్ని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ… చాలా సింబాలిక్ గా చెప్పడం విశేషం. అప్పట్లో కనబడకుండా పోయిన మలేషియా విమానాన్ని ఉదాహరణగా చెబుతూ.. ఆ విమానం ఎందుకు పోయింది..? ఎలా పోయింది..? ఎక్కడ పోయిందనే..? విషయం ఇప్పటికీ ఎవరికీ తెలీదు…! అలాగే మా సినిమా కూడా ఎందుకు ఆగిపోయిందో తెలీదు. ఏదో తాత్కాలికంగా బ్రేక్ వచ్చింది .. దాదాపు అరవై శాతం సినిమా పూర్తయినప్పటికీ .. మిగిలిన షూటింగ్ కూడా పూర్తయ్యేది… ఎప్పటికైనా ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తాను, అది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. బాలయ్య బాబు కెరీర్లో ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది” అంటూ ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చిన ఆయన… ఆ కోరిక తీరకుండానే కన్ను మూయడం విషాదకరం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus