బిగ్ బాస్ 4: లాస్య లాజిక్ కరెక్టేనా..?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ రసవత్తరంగా ముగిశాయి. ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ లాజిక్స్ మాట్లాడుతూ మాటల యుద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా అరియానా లాస్యని నామినేట్ చేసేటపుడు యూనిటీ లేదు. అర్ధరాత్రి ఒకరి పేరు చెప్పాలి అన్నప్పుడు మీరు మీ పేరు చెప్పుకోవడం అనేది నాకు నచ్చలేదు. అలాకాకుండా అందరూ ఒకే మాటపైన ఉంటే బాగుండేది అనిపించింది అని చెప్పింది. నిజానికి అక్కడ లాస్య తనపేరు చెప్పుకునేటపుడే స్ట్రాంగ్ ప్లేయర్ ని ఎలా పంపించేస్తాం అనే డిస్కషన్ పెట్టింది. నాకు ఇది అన్ ఫైయిర్ గా అనిపిస్తోందని చెప్పి నేను ఎవరి పేరు చెప్పను అంటూ తనపేరు తనే చెప్పుకుంది.

ఈవిషయాన్ని గుర్తు చేస్తూ అరియానా లాస్యని నామినేట్ చేసింది. నువ్వు ఎవరితనూ కలవలేదు. యూనిటీగా లేవు అని చెప్పింది. ఆతర్వాత లాస్య అరియానాని తిరిగి నామినేట్ చేస్తూ, అక్కడ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేందుకు ఎవరిపేరు అయినా ఏకాభిప్రాయంతో చెప్పమని చెప్పారు. కానీ నాకు ఎవరి పేరు చెప్పడం ఇష్టంలేదు. దీనిపైన అందరూ ఏకాభిప్రాయంతో ఉంటే ఏం జరిగి ఉండేదో చూసేవాళ్లం కదా అనే లాజిక్ మాట్లాడింది. ఈవిషయం అక్కడ మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ లాస్య యాక్షన్ కి అరియానా రియాక్షన్ ఇచ్చింది.

ఒక పాయింట్ లో లాస్య చెప్పింది అక్షరాలా నిజం. ఇదేవిషయాన్ని తను అందరితో కాకుండా కేవలం హారిక ఇంకా అభిజిత్ లతో మాత్రమే పంచుకుంది. ఇంకాసేపు ఉంటే ఏం జరిగేదో చూసేవాళ్లం కదా.. అంటూ మాట్లాడింది. కానీ అక్కడ లాస్య మాటలకి ఇంపార్టెన్స్ అనేది లేకుండా పోయింది. ఇక్కడే గట్టిగా డెసీషన్ తీసేస్కున్నారు మిగతా హౌస్ మేట్స్ అందరూ. అందుకే సైలెంట్ అయిపోయింది లాస్య. కానీ తను అనుకున్న పాయింట్ పై క్లియర్ గా ఉంది. అదే విషయాన్ని అరియానాకి చెప్పింది. ఈ పాయింట్ పైన నామినేట్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనేది అరియానాని అడిగింది. ఇక ఒకరినొకరు నామినేట్ చేసుకుని ఇప్పుడు ఇద్దరూ డేంజర్ జోన్ లోకి వచ్చారు. మరి ఈవారం హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus