బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే కరోనా కారణంగా అసలు ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలు వినిపించాయి. వాటికి చెక్ పెడుతూ ప్రోమోను వదిలి క్లారిటీ ఇచ్చారు నిర్వాహకులు. ఇప్పుడు మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ ప్రోమోకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయిందట. ఆగస్టు 22 నుంచి వారందరినీ క్వారంటైన్ కు తరలించనున్నట్లు సమాచారం. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్ చేసి సెప్టెంబర్ 5న నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారట. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది.
అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి.