అవకాశాల కోసం హద్దులు దాటేస్తున్న లావణ్య

2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠీ. ఫస్ట్ మూవీతోనే ఎక్సట్రార్డినరీ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. కేవలం సాంప్రదాయ బద్దమైన పాత్రలు చేసిన లావణ్యకు స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రాలేదు. కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నప్పటికీ టూ టైర్ హీరోలకే పరిమితం అయ్యింది. ఆమె గ్లామర్ రోల్స్ అలాగే స్కిన్ షోకి ఒప్పుకోకపోవడం కూడా ఓ కారణం కావచ్చు. ప్రస్తుతం లావణ్య కెరీర్ ప్రమాదంలో ఉంది. ఆమె చేతిలో తెలుగులో ఒక్క సినిమా మాత్రమే ఉంది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ఏ వన్ ఎక్సప్రెస్ మూవీలో ఆమె నటిస్తుంది. ఆ సినిమా పెద్ద విజయం సాధించినా ఆమెకు భారీగా అవకాశాలు వస్తాయని నమ్మకం లేదు. దీనితో వాస్తవాలను అర్థం చేసుకున్న లావణ్య దర్శక నిర్మాతలకు స్కిన్ షో చేయడానికి రెడీ అంటూ సందేశం పంపుతుంది. కొన్నాళ్లుగా ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ గమనిస్తే మనకు ఈ విషయం అర్థం అవుతుంది. ఆమె హాట్ హాట్ ఫోజులలో పొట్టి బట్టలు ధరించి ఫోటో షూట్ లు చేస్తుంది.

సదరు ఫోటోలు సోషల్ మాధ్యమాలలో పంచుకుంటుంది. మరి గ్లామర్ పాత్రలకు సిద్ధం అని లావణ్య హింట్ ఇస్తుండగా మన దర్శక నిర్మాతలు పట్టించుకుంటారో లేదో చూడాలి. ఐనా ఇదేదో ఫార్మ్ లో ఉన్నప్పుడు చేస్తే లావణ్య కెరీర్ కి చాల బూస్ట్ ఇచ్చేది. ఫేడ్ అవుట్ సమయంలో ఈ టర్న్ తీసుకుంటే ఏమి లాభం అని కొందరి అభిప్రాయం.

1

2

3

4


5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus