Lavanya Tripathi: పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి…!

ఉత్తర్ ప్రదేశ్ యూ చెందిన భామ లావణ్య త్రిపాఠి… 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘దూసుకెళ్తా’ ‘మనం’ ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘అర్జున్ సురవరం’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఈ మధ్యనే ‘పులి మేక’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ అందులో కూడా తన నటనతో మెప్పించింది.

కెరీర్ ప్రారంభం నుండి ఈమె గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేస్తూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె ఎక్కువగా పెళ్లి వార్తలతోనే ఎక్కువగా ట్రెండింగ్లో నిలుస్తుంది. మెగా హీరో వరుణ్ తేజ్ ను ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి ఇంటికి వెళ్లి మరీ ప్రపోజ్ చేసి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్లకు లావణ్య త్రిపాఠి వెళ్లొస్తున్న సంగతి మాత్రం నిజమే. అయితే తాజాగా.. ఈ వార్తల పై లావణ్య వరుణ్ తేజ్ పేరు ఎత్తకుండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదు. కాబట్టి నేను కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లికి సంబంధించి నేనేమి కలలు కనడం లేదు.

ప్రస్తుతం నా ఫుల్ ఫోకస్ సినిమాలపైనే ఉంది. కానీ పెళ్లి మీద నాకు నమ్మకం ఉంది. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుంది.అయినా పెళ్లి అనేది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. కాబట్టి నా వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పడం నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus