Lavanya Tripathi: బోల్డ్ రోల్స్ విషయంలో మెగా కోడలి షాకింగ్ నిర్ణయమిదే.. ఏం జరిగిందంటే?

వరుణ్ తేజ్ కు కాబోయే భార్య లావణ్య త్రిపాఠి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్, లావణ్యల పెళ్లి తేదీ గురించి క్లారిటీ లేకపోయినా ఈ ఏడాదే వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. లావణ్య త్రిపాఠి బోల్డ్ రోల్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కొన్ని సినిమాలలో గ్లామరస్ గా కనిపించిన లావణ్య త్రిపాఠి కొన్ని నెలల క్రితం ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరికొన్ని రోజుల్లో ఈ వెబ్ సిరీస్ షూట్ మొదలుకానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో తన రోల్ ఒకింత బోల్డ్ గా ఉండటంతో లావణ్య ఈ వెబ్ సిరీస్ కు నో చెప్పారని సమాచారం అందుతోంది. త్వరలో మెగా ఇంటికి కోడలు కానుండటంతో లావణ్య త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు తనకు బదులుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలని కోరారట. లావణ్య త్రిపాఠి నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని అయితే ఎంచుకునే రోల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లావణ్య రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

వరుణ్ తేజ్ లావణ్యలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ లావణ్య కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లావణ్య పెళ్లి తర్వాత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus