Lavanya Tripathi: అనాథాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసిన లావణ్య.. మంచి మనస్సంటూ?

  • April 25, 2023 / 06:39 PM IST

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటించకపోయినా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఒక హీరోతో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగినా ఆ వార్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో లావణ్య త్రిపాఠి నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. తాజాగా ఒక సందర్భంలో లావణ్య త్రిపాఠి అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మంచి మనస్సుకు సాధారణ నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో మార్గం రాజేశ్ అనే వ్యక్తి అనాథాశ్రమాన్ని నడిపిస్తుండగా ఈ అనాథాశ్రమంలో లావణ్య త్రిపాఠి సందడి చేశారు. లావణ్య త్రిపాఠి పిల్లలకు కబుర్లు చెప్పడంతో పాటు పిల్లలతో కలిసి ప్రేమగా ఫోటోలు దిగారు. పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలతో కలిసి భోజనం చేసి తన మనస్సు బంగారం లాంటి మనస్సు అని ప్రూవ్ చేసుకున్నారు.

కొంతమంది పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకొని వాళ్లకు అవసరమైన మందులను సైతం లావణ్య త్రిపాఠి అందించారు. మరోవైపు ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు. స్టార్ హీరోలు ఈ బ్యూటీకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు. అయితే రాబోయే రోజుల్లో అయినా లావణ్యకు మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.

లావణ్య త్రిపాఠి పారితోషికం కూడా తక్కువగానే ఉందని సమాచారం అందుతోంది. లావణ్య త్రిపాఠిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లావణ్య త్రిపాఠి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus