Aadikeshava: శ్రీలీలతో అంత ఈజీ కాదు.. వైష్ణవ్ తేజ్ తో ప్రూవ్ అయ్యిందిగా

నిన్న సుమ స్నాక్స్ కాంట్రోవర్సీ పుణ్యమా అని ‘ఆదికేశవ’ చిత్రం 24 గంటల నుండి ట్రెండింగ్లో ఉంది. వాస్తవానికి ఆ ప్రెస్మీట్ పెట్టింది కూడా పాట గురించే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అది ఎక్కడో మొదలై.. ఇంకెక్కడికో వెళ్ళింది. ఇంకా ఆగలేదు. సుమ ఇష్యు వల్ల ‘ఆదికేశవ’ సినిమాలోని ‘లీలమ్మో’ అనే పాట కూడా హాట్ టాపిక్ అయ్యింది. జీవి ప్రకాష్ కుమార్ ‘ఆదికేశవ’ కి మంచి సంగీతం అందించాడు.

మొదట రిలీజ్ అయిన రెండు పాటలు కూడా శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఈసారి ఓ మాస్ పాట బయటకి వచ్చింది. ట్యూన్ బాగుంది. పాట వింటే అందరిలోనూ మంచి ఎనర్జీ వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ పాట కొత్త అనుమానాలకు దారి తీసింది అని చెప్పాలి. ఎందుకంటే ‘లీలమ్మో’ లిరికల్ సాంగ్ ను కనుక చూస్తే.. అందులో శ్రీలీల డాన్స్ హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఆమె స్పీడ్ ను హీరో వైష్ణవ్ తేజ్ ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు.

కెమెరామెన్ ఫోకస్ అంతా శ్రీలీల తన వైపు తిప్పుకున్నట్టు అయ్యింది. ఆమె గ్లామర్ పరంగా అట్రాక్ట్ చేసేది అంతంత మాత్రమే. కానీ తన డాన్స్ లతో మాత్రం చూపు తిప్పుకోకుండా చేసేస్తుంది. అందుకే ఈ పాటలో వైష్ణవ్ తేజ్.. శ్రీలీల ముందు తేలిపోయినట్టు కనిపించాడు. అతనికి మాత్రమే కాదు భవిష్యత్తులో శ్రీలీలతో కలిసి నటించే హీరోలందరూ కూడా శ్రీలీల గ్రేస్ ను మ్యాచ్ చేయడం కష్టమే అని అందరికీ తెలిసొచ్చింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus