ఎన్టీఆర్ 27 కి లెగసీ ఎఫెక్ట్స్ అందించనున్న హాలీవుడ్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్!

  • February 4, 2017 / 11:41 AM IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్  27 మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా ఈ చిత్రం పై ఆసక్తి కలగడానికి అనేక కారణాలున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలో నటించడం ప్రధాన కారణం. అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇందుకోసం వందకోట్లు బడ్జెట్ కేటాయించడం మరో కారణం. ఇక  ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోవడం విశేషం. తాజాగా ఈ రోజు హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తమ టీమ్ లోకి తీసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించి ఔరా అనిపించింది. ఇతను లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, రోబో వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు.

ప్రత్యేక పద్ధతి ద్వారా మనుషులను విభిన్న రూపాల్లో కనిపించేలా చేయగల సత్తా ఇతని సొంతం. జై లవ కుశ అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో మూడు క్యారెక్టర్స్ ని ముఖ్యంగా విలన్ పాత్రను విభిన్నంగా చూపించనున్నట్లు సమాచారం. ఈ విలన్ పాత్ర కూడా ఎన్టీఆర్ పోషిస్తున్నా సంగతి తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లి వాన్సీ హార్ట్ వెల్ ని కలిసి కథ చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. అతనితో కలిసి తారక్ తీసుకున్న ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus