చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ బ్యూటీ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఎంతో మందిని పాపులర్ చేసింది. చాలా మంది సినిమాల్లో బిజీగా రాణిస్తున్నారు అంటే ఈ షో కూడా ఓ కారణమని చెప్పాలి. సౌత్ లో కంటే ముందే నార్త్ లో ఈ షో సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల కంటే కూడా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సినిమాల్లో, సిరీస్ లో అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. హిందీ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఉర్ఫీ జావెద్ కూడా ఒకరు.

బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ పాపులర్ అయ్యింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె విచిత్రమైన దుస్తుల్లో కనిపిస్తూ రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఈమె స్టైల్ ఆ డ్రెస్సులు కలర్స్ అబ్బో చూసిన వెంటనే జిగేల్ జిగేల్ అనిపిస్తూ ఉంటాయి. అలాగే అందాల ఆరబోతకు కూడా ఈ అమ్మడు తగ్గదు. అసలు బట్టలు వేసుకున్నా.. వేసుకున్నట్టు అనిపించదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉంటారు.

మొన్నామధ్య ఈమె కారు దిగి ఓ ఫోటో షూట్ కు ఫోజులు ఇస్తుంటే కొంతమంది బెగ్గర్స్ వచ్చి ఈమెకు డబ్బులు ఇస్తామని మంచి దుస్తులు కొనుక్కోమని సెటైర్లు వేశారు. అంతలా ఉంటుంది ఈమె వస్త్ర శైలి. ఈమెకు బట్టలు డిజైన్ చేస్తున్న వారికి కూడా ఓ దణ్ణం పెట్టేయొచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా ఉర్ఫీ జావెద్ ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో కూడా ఆమె స్టైల్ లో వింతగానే కనిపించింది. అయితే ఆ పాటలో ఆమె వాడిన, పాడిన పదాలు అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. దీంతో ఈ విషయంపై ఉర్ఫీ జావెద్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ పదాలు తెలుగులో కూడా బూతులుగా అనిపిస్తున్నాయి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె పై కేసు నమోదవ్వడం పై ఉర్ఫీ జావెద్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus