తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆ పాట బాగా వైరల్ అయ్యింది. ట్రైలర్ పెద్దగా ఆకట్టుకుంది లేదు. అయినప్పటికీ ‘విక్రమ్’ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి.. లియో పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అవ్వగా ఆల్రెడీ చాలా షోలు సోల్డ్ అవుట్ అయిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..తమిళంలో లియో చిత్రం ఎర్లీ మార్నింగ్ షోలు వేయకూడదు అని కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తెలుగులో కూడా ‘లియో’ పై కేసు ఫైల్ అయ్యింది. ఆల్రెడీ అదే పేరును ఇంకో సినిమా యూనిట్ రిజిస్టర్ చేయించుకుంది.
దీంతో అక్టోబర్ 19న ‘లియో’ (LEO) చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయకూడదు అని .. ఆ సినిమా యూనిట్ అడ్డుపడింది. దీంతో ‘లియో’ రిలీజ్ కి కష్టాలు ఎదురైనట్టు అయ్యింది. కానీ ‘ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయాయని, మా సినిమాకి ఆల్రెడీ సెన్సార్ అయిపోయిందని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని, కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాగ వంశీ చెప్పుకొచ్చాడు.