దసరా కానుకగా తెలుగులో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ కాగా, ఇంకోటి నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’. రెండు సినిమాల ప్రమోషనల్ కంటెంట్ బాగున్నాయి. సెలవుల సీజన్ కాబట్టి.. ఈ సినిమాలు ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్టోబర్ 19 న ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కాబోతుండగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కాబోతుంది.
అయితే అక్టోబర్ 19 నే విజయ్ నటించిన ‘లియో’ (LEO) సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది కాబట్టి.. ఈ డబ్బింగ్ సినిమా పై కూడా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే డిస్ట్రిబ్యూటర్స్ లో స్ట్రెయిట్ మూవీస్ అయిన ‘భగవంత్ కేసరి’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ల కంటే కూడా ‘లియో’ కే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే ‘భగవంత్ కేసరి’ చిత్రానికి మల్టీప్లెక్స్ లో రూ. 250, సింగిల్ స్క్రీన్ లో రూ.175 టికెట్ రేట్లు ఉన్నాయి.
‘టైగర్ నాగేశ్వరరావు’ కి మల్టీప్లెక్స్ లో రూ. 200, సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 గా టికెట్ రేట్లు ఉన్నాయి. అయితే ‘లియో’కి మాత్రం మల్టీప్లెక్స్ లో రూ. 295, సింగిల్ స్క్రీన్ రూ.175 గా టికెట్ రేట్లు ఉన్నాయి. అంటే ఒరిజినల్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉందని అర్థం చేసుకోవచ్చు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు