Allu Arjun: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కే కాదు.. చరణ్‌, బన్నీ కూడా షాకే!

2022లో అల్లు అర్జున్‌, నందమూరి బాలకృష్ణ రాలేదు అని మొన్నీమధ్యే చదువుకున్నాం. మాస్‌ హీరోల సినిమాలు ఇలా రాకపోతే… కాస్త వెలితిగానే ఉంటుంది. అయితే గతేడాది ఇద్దరు స్టార్లు రాలేదు కదా అనుకుంటే ఈ ఏడాది అంటే 2023లో ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోలు రావడం లేదని తెలుస్తోంది. అందులో తారక్‌ విషయం ఆ టీమే చెప్పింది. మిగిలిన ఇద్దరు హీరోల విషయం ఇప్పుడు మేం చెప్పబోతున్నాం. వాళ్లే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.

అవును మీరు చదివింది కరెక్టే. వాళ్ల ప్రస్తుత సినిమాల షూటింగ్‌ సాగుతున్న తీరు, ఆయా నిర్మాతల ఆలోచనల బట్టి చూస్తే.. చరణ్‌, బన్నీ 2023లో వెండితెరపై కనిపించకపోవచ్చు. తొలుత రామ్‌చరణ్‌ విషయం చూస్తే… ప్రస్తుతం ఆయన శంకర్‌ – దిల్‌ రాజు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నిజానికి ఈ సంక్రాంతికే రావాలి, కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. పోనీ ఏ సమ్మర్‌కో, దసరాకో వస్తుందా అంటే కష్టమే అంటున్నారు. ప్రస్తుతం శంకర్‌.. కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’ కూడా చేస్తున్నారు.

ఆ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత చరణ్‌ సినిమా మీద పూర్తి దృష్టి పెడతారు అని సమాచారం. దీంతోపాటు ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం చాలా రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. శంకర్‌ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందిలెండి. బడ్జెట్‌ కూడా భారీగానే పెరిగింది అంటున్నారు. ఆ లెక్కన ఇంత భారీ సినిమాను సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ చేయడానికే టీమ్‌ ఆలోచిస్తుంది అంటున్నారు. ఆ లెక్కన 2023లో చరణ్‌ డౌట్‌. ఇక అల్లు అర్జున్‌ పరిస్థితి చూస్తే ‘పుష్ప 2’ సినిమాను ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్‌ చేయలేదు.

చేశాము అంటున్నారు, చేయాలి అంటున్నారు కానీ అయ్యిందో కాదో చెప్పడం లేదు. సుకుమార్‌ వర్క్‌ స్టైల్‌ తెలిసినవారెవరూ ఈ సినిమా ఈ ఏడాది వస్తుంది అనుకోలేరు. ఆ లెక్కన వచ్చే ఏడాదే అని చెబుతున్నారు. అయితే ‘పుష్ప 1’ తరహాలో ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరున అంటే డిసెంబరులో తెచ్చే అవకాశమూ ఉంది. కానీ స్పష్టత లేదు. దీంతో 2023లో బన్నీ కూడా డౌట్‌. ఇక ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమాను 2024 ఏప్రిల్‌లో విడుదల చేస్తామని టీమ్‌ ఇటీవల చెప్పింది. దీంతో 2023లో ముగ్గురు స్టార్లు రారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus