తల్లీకూతుళ్ళిద్దరూ ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నారు!

  • December 5, 2017 / 10:32 AM IST

ఒక కుటుంబానికి చెందిన రెండు తరాల కథానాయికలు ఒకేసారి ఒకే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అనేది బహుశా ఇప్పటివరకూ ఎప్పుడూ జరగలేదేమో. ఇకపై జరుగుతుందో లేదో కూడా చెప్పలేం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు తల్లీకూతుళ్ళు లిజీ-కళ్యాణి. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ భార్య లిజీ ఇదివరకు తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఉన్నప్పటికీ.. నేటితరం ప్రేక్షకులకెవరికీ ఆమె ఎవరో తెలియదు. దాదాపు దశాబ్ధం తర్వాత మళ్ళీ ఆమె నితిన్ 25వ చిత్రంగా రూపొందుతున్న సినిమా ద్వారా తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో ఆమె ఏ పాత్ర పోషించనుంది అనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ ఆమె రీఎంట్రీ మాత్రం హల్ చల్ చేయనుంది.

మరోపక్క ఆమె కుమార్తె కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో అఖిల్ అక్కినేని సరసన తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. తొలుత కొన్ని వందలమంది నటీమణులను ఆడిషన్ చేసిన అనంతరం నాగార్జున స్వయంగా కళ్యాణి ప్రియదర్శినిని “హల్లో” సినిమాలో కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విధంగా కూతురు అఖిల్ తో ఆరంగేట్రం చేస్తుండగా.. తల్లి నితిన్ తో రీఎంట్రీ ఇస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే.. “హెల్లో” డిసెంబర్ 22న విడుదలవుతుండగా.. “నితిన్ 25వ చిత్రం” వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో విడుదలకానుంది. మరి తల్లీకూతుళ్ళు తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించగలరో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus