గెస్ట్ లిస్ట్ మరీ ఇంత స్ట్రిక్ట్ ఉంటుందనుకోలేదెవ్వరు

సినిమావాళ్ళ పెళ్లిళ్లు అంటే సాధారణ జనాలందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. పెళ్లి కొడుకు/కూతురు ఎవరు అనే విషయం దగ్గర నుంచి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, మండపం ఎంత భారీగా ఉంది వంటి విషయాలతోపాటు ఎవరెవరు వస్తున్నారు అనేది హాట్ టాపిక్ అనే అనుకోవాలి. ఎన్టీఆర్ పెళ్ళికి మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ లు హాజరవ్వడం, చరణ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ స్వయంగా చరణ్ ను తన కారులో మండపానికి తీసుకురావడం వంటిని ఇప్పటికీ సినీ వర్గాల చర్చనీయాంశమైన మధుర స్మృతులు.

అయితే.. కరోనా కారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఇప్పుడు ప్రయివేట్ ఎఫైర్ అయిపోయాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. సమంత పెళ్లి గోవాలో ఘనంగా జరిగిన దగ్గర నుంచి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి క్రేజ్ భీభత్సంగా పెరిగింది. ఇక కరోనా కాలంలో లిమిటెడ్ గెస్టులు అనేది తప్పనిసరిగా పాటించాల్సిన రూల్ కావడంతో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి కంపల్సరీ అయిపోయాయి. ఈ ఫార్మాట్ నే ఫాలో అవుతున్నారు నిహారిక-చైతన్యల పెళ్లి ఉదయ్ పూర్ లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ పెళ్ళికి మెగా కుటుంబ సభ్యులైన చిరంజీవి, చరణ్, వరుణ్, సాయితేజ్ & ఫ్యామిలీతోపాటు వరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ & నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతున్నారట. మిగతా సినిమా పెద్దలు కానీ, చిరంజీవి సన్నిహితులు కానీ ఎవరు హాజరవ్వడం లేదట. వాళ్ళందరి కోసం హైదరాబాద్ లో సపరేట్ గా రిసెప్షన్ ప్లాన్ చేయనున్నారట మెగా మెంబర్స్.

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు

1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus