2023 Rewind: గతేడాది రీ ఎంట్రీ ఇచ్చిన 15 మంది దర్శకుల లిస్ట్.. సక్సెస్ అయ్యారా? లేదా?

గతేడాది చాలా మంది దర్శకులు రీ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల వీళ్ళ కెరీర్ కి బ్రేక్ వచ్చింది. మరి 2023 లో వీళ్ళు హిట్లు కొట్టారా లేదా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఎస్వీ కృష్ణారెడ్డి :

‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాతో 2023 లో రీ ఎంట్రీ ఇచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి. 2014 లో వచ్చిన ‘యమలీల 2’ తర్వాత కృష్ణారెడ్డి నుండి వచ్చిన సినిమా ఇది. సోహెల్ హీరోగా నటించాడు. మొదటి షోతోనే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

2) అవసరాల శ్రీనివాస్ :

ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్.. 2016 లో వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా తర్వాత డైరెక్టర్ గా గ్యాప్ తీసుకున్నాడు.2023 లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది.

3) కృష్ణవంశీ :

2017 లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత కృష్ణవంశీ కొంత గ్యాప్ తీసుకుని.. 2023 లో ‘రంగమార్తాండ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాగానే ఆడింది. కృష్ణవంశీ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు.

4) గుణశేఖర్ :

2016 లో వచ్చిన ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

5) కార్తీక్ దండు :

2015 లో ‘భమ్ బోలేనాథ్’ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ దండు. 2023 లో ఇతను ‘విరూపాక్ష’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

6) శ్రీవాస్ :

2018 లో వచ్చిన ‘సాక్ష్యం’ తర్వాత దర్శకుడు శ్రీవాస్ కి అవకాశాలు లేవు. 5 ఏళ్ళ తర్వాత అంటే 2023 లో గోపీచంద్ తో చేసిన ‘రామ బాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది.

7) నీలకంఠ :

2014లో వచ్చిన ‘మాయ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2023 లో ‘సర్కిల్’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు నీలకంఠ. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

8) సాయి రాజేష్ :

2014 వచ్చిన ‘హృదయ కాలేయం’ తర్వాత గ్యాప్ తీసుకుని 2023 లో ‘బేబీ’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు సాయి రాజేష్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

9) అనిల్ కన్నెగంటి :

2012 లో వచ్చిన ‘మిస్టర్ నూకయ్య’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2023 లో ‘హిడింబ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనిల్ కన్నెగంటి. ఈ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

10) సముద్రఖని :

2015 లో వచ్చిన ‘జెండా పై కపిరాజు’ తర్వాత గ్యాప్ తీసుకుని 2023 లో ‘బ్రో’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు సముద్రఖని. ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది.

11) మెహర్ రమేష్ :

2013 లో వచ్చిన ‘షాడో’ తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ 2023లో ‘భోళా శంకర్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది.

12) మహేష్ బాబు పి :

2014 లో వచ్చిన ‘రారా కృష్ణయ్య’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2023 లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది సూపర్ హిట్ అయ్యింది.

13) వంశీ కృష్ణ :

2017 లో వచ్చిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వంశీ కృష్ణ ‘టైగర్ నాగేశ్వరరావు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఫ్లాప్ అయ్యింది.

14) వక్కంతం వంశీ :

2018 లో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2023 లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వక్కంతం వంశీ. ఈ సినిమా కూడా ఆడలేదు.

15) రత్నం కృష్ణ :

2017 లో వచ్చిన ‘ఆక్సిజన్’ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి 2023 లో ‘రూల్స్ రంజన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఏ.ఎం.రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ అలియాస్ (Rathnam Krishna) రత్నం కృష్ణ. ఈసారి కూడా అతనికి సక్సెస్ దొరకలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus