‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

ఒకప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వాళ్లే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై హీరోలుగా, హీరోయిన్లుగా,క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సోషల్ మీడియా ఫేమ్ నుండి సినిమా సక్సెస్ వరకు వాళ్ల జర్నీ నెక్స్ట్ లెవల్. ఈ కొత్త ట్రెండ్‌లో దూసుకుపోతున్న కొందరు నటీనటుల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

Influencers to Artists

1) హర్ష చెముడు (వైవా హర్ష): ‘వైవా’ వెబ్ యూట్యూబ్ వీడియోలతో ‘వైవా హర్ష’ గా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు. తన యూనిక్ కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు.’గోవిందుడు అందరివాడేలే’ ‘కలర్ ఫోటో’, ‘కార్తికేయ 2’ నుంచి రీసెంట్ ‘గేమ్ ఛేంజర్’ ‘తెలుసు కదా’ వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు.

2) సుహాస్: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ యాక్టర్ ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు. 2024లో ‘ప్రసన్నవదనం’, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ లాంటి ఐదు సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. కంటెంట్ ఉన్న కథలకు సుహాస్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు.

3) వైష్ణవి చైతన్య: ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2023లో వచ్చిన ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా, టాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది. ఈ సినిమాలోని నటనకు ఏకంగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది.

4) నిహారిక ఎన్ ఎమ్: తన ఫన్నీ రీల్స్‌తో సోషల్ మీడియాను ఊపేసే ఈ కంటెంట్ క్రియేటర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ‘మిత్ర మండలి’ (2025) సినిమాతో నటిగా మారింది. తన ట్రేడ్‌మార్క్ కామెడీతోనే వెండితెరపై కూడా ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయింది.

5) సందీప్ రాజ్: ‘కలర్ ఫోటో’ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్. డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగానూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాడు.

6) దీపికా పిల్లి: టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో ఫేమస్ అయిన దీపికా, ఇప్పుడు హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటోంది. ‘వాంటెడ్ పండుగాడ్’ (2022) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (2025) లాంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

7) మౌళి: ‘మౌళి టాక్స్’ యూట్యూబ్ ఛానల్‌తో ఫేమస్ అయిన మౌళి తనుజ్ ప్రశాంత్ యాక్టర్‌గా మారాడు. ‘హాస్టల్ డేస్’, ’90స్’ వెబ్ సిరీస్‌లతో పాటు ‘లిటిల్ హార్ట్స్’ (2025) సినిమాలోనూ నటించాడు. తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

8) కిరణ్ అబ్బవరం: షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. తన సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తుంటాడు.

9) ప్రసాద్ బెహరా: ‘పెళ్ళివారమండి’ ‘వివాహ భోజనంబు’ వంటి యూట్యూబ్ సిరీస్..లతో పాపులర్ అయిన ఇతను ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించాడు. తర్వాత ‘బచ్చల మల్లి’ ‘మిత్రమండలి’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు రోజుకి లక్ష రూపాయలు పారితోషికం తీసుకునే రేంజ్ కి వెళ్ళాడు. పైగా కార్ వ్యాన్ కూడా ఇస్తున్నారు అని టాక్.

10) సుమంత్ ప్రభాస్: ఇతను కూడా యూట్యూబ్ వీడియోలు చేసుకునే కుర్రాడు. తర్వాత ‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోగా మారిపోయాడు. ఇప్పుడు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

11) మహేష్ విట్టా: ‘ఫన్ బకెట్’ వంటి యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతను ‘కృష్ణార్జున యుద్ధం’ ‘రాజా ది గ్రేట్’ వంటి సినిమాల్లో నటించాడు.

12) రవితేజ నన్నిమల: ‘సోటారి బ్రదర్స్’ వంటి యూట్యూబ్ సిరీస్..తో పాపులర్ అయిన ఇతను పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, నాని ‘దసరా’ , ‘మ్యాడ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

13) సుదర్శన్: నెల్లూరు యాసలో మాట్లాడుతూ ఫేమస్ అయిన సుదర్శన్ కూడా యూట్యూబ్ వీడియోలతోనే ఫేమస్ అయ్యాడు. ‘కుమారి 21 ఎఫ్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అతను నటించిన సంగతి తెలిసిందే.

14) దేత్తడి హారిక: ‘దేత్తడి’ సిరీస్ తో పాపులర్ అయిన ఈమె తర్వాత ‘ఆదిత్య వర్మ'(అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) ‘చాణక్య’ ‘వరుడు కావలెను’ వంటి సినిమాల్లో నటించింది.

15) మౌనిక రెడ్డి: ఈమె కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. తర్వాత ‘భీమ్లా నాయక్’ ‘ధమాకా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus