2 మిలియన్ డాలర్ సినిమాలున్న11 మంది హీరోలు – ఎవరంటే?

మొన్నటి వరకు యూఎస్ బాక్సఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్ కొడితే చాలు…అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు 1 మిలియన్ డాలర్ షరా మాములు అయిపోయింది. ఎందుకంటే మన తెలుగు సినిమాలు ఇప్పుడు అలవోకగా 2 మిలియన్ డాలర్ కూడా కొట్టేస్తున్నాయి…

సంక్రాంతి పండుగకు రిలీస్ అయినా వాల్తేరు వీరయ్య యూఎస్ బాక్సఫీస్ దగ్గర మెరుపు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మొన్నే 1 మిలియన్ డాలర్ కొట్టిన వీరయ్య ఇప్పుడు ౨ మిలియన్ డాలర్ మార్కుని కూడా దాటేశాడు..

వాల్తేరు వీరయ్య తో ముచ్చటగా మూడో సారి 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన చిరు తో కలుపుకుని ఈ లిస్టులో వున్నా మిగతా 11 మంది హీరోలు ఎవరో వారి సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం…

1) మహేష్ బాబు – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 4

శ్రీమంతుడు

భరత్ అనే నేను

సరిలేరు నీకెవ్వరు

సర్కారు వారి పాట

2) ప్రభాస్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 4

బాహుబలి 2: ది కన్ క్లూజన్

బాహుబలి – ద బిగినింగ్

సాహో

రాధేశ్యామ్

3) చిరంజీవి – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 3

సైరా నరసింహారెడ్డి

ఖైదీ నెంబర్ 150

వాల్తేరు వీరయ్య

4) పవన్ కళ్యాణ్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 2

భీమ్లా నాయక్

అజ్ఞాతవాసి

5) జూ ఎన్టీఆర్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 2

అరవింద సమేత వీర రాఘవ

నాన్నకు ప్రేమతో

6) అల్లు అర్జున్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 2

పుష్ప

అల వైకుంఠపురములో

7) విజయ్ దేవరకొండ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 2

అర్జున్ రెడ్డి

గీత గోవిందం

8) వరుణ్ తేజ్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 2

ఫిదా

ఎఫ్2 – ఫన్ & ఫ్రస్ట్రేషన్

9) వెంకటేష్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 1

ఎఫ్2 – ఫన్ & ఫ్రస్ట్రేషన్

10) రామ్ చరణ్  – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 1

రంగస్థలం

11) నితిన్ – 2 మిలియన్ డాలర్ సినిమాలు – 1

అ ఆ

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus