2020 టు 2022-సంక్రాంతి వరకు.. 50 రోజులు ఆడిన తెలుగు సినిమాలు..!

ఒకప్పుడు సినిమా హిట్టా… కాదా అని చెప్పడానికి ఆ మూవీ ఎన్ని రోజులు ఆడింది అనేది ఎక్కువగా చెప్పుకునే వారు. 25 రోజులు ఆడితే యావరేజ్ అని, 50 రోజులు ఆడితే హిట్ అని.. 100 రోజులు ఆడితే సూపర్ హిట్ అని 150,175 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే వాళ్ళు.తర్వాత ఎన్ని రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనేదాన్ని బట్టి సినిమా హిట్, యావరేజ్, బ్లాక్ బస్టర్ అనేది డిసైడ్ చేసేవారు. అవన్నీ టీవీలు రాని రోజుల్లో సంగతి. అయితే ఇప్పుడు అందరి ఫోన్లలో ప్రపంచం ఉంటుంది.

ఒకరోజు ఎన్ని సినిమాలైనా చూడొచ్చు. సినిమా రిలీజ్ అయిన 3,4 వారాలకే డిజిటల్ రిలీజ్ అయిపోతుంది. అందుకోసం ఓటిటి సంస్థలు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. పైగా ఇంకో పక్క పాండమిక్ ఒకటి. ఇన్ని అడ్డంకుల నడుమ ఓ సినిమా 50 రోజులు ఆడింది అంటే దానిని గ్రేట్ అనే చెప్పుకోవాలి. 2020 నుండీ 2022 సంక్రాంతి వరకు 7 సినిమాలు 50 రోజులు థియేటర్లలో ఆడాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అల వైకుంఠపురములో : 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 175 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

2) సరిలేరు నీకెవ్వరు : 2020 సంక్రాంతికే విడుదలైన ఈ చిత్రం కూడా 110 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

3) క్రాక్ : 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కూడా 110 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

4) ఉప్పెన : 2021 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం 100 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

5) జాతి రత్నాలు : 2021 మార్చిలో రిలీజ్ అయిన ఈ చిత్రం 50 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

6)పెళ్ళిసందD : 2021 అక్టోబర్లో విడుదలైన ఈ చిన్న సినిమా కూడా 5 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

7) అఖండ : 2021 డిసెంబర్ లో విడుదలైన బాలయ్య- బోయపాటి ల ‘అఖండ’ చిత్రం జనవరి 20 వ తేదీతో 50 రోజులు పూర్తిచేసుకోబోతుంది. 103 కేంద్రాల్లో ఈ మూవీ అర్ధ శతదినోత్సవం జరుపుకుంటుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus