ఒకప్పటి హీరోయిన్లు.. స్టార్ హీరోల సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రోల్స్ డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. వాళ్ళు ఏ సీనియర్ హీరోయిన్ ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాసుకుంటారో… ఆ హీరోయిన్లు చేస్తేనే ఆ పాత్రలకు అందం అని వారు భావిస్తూ ఉంటారు. కానీ ఆ హీరోయిన్లు కనుక ఒప్పుకోకపోతే వాళ్లకు సమస్య వచ్చి పడుతుంది. ఇంకో సీనియర్ హీరోయిన్ లేదా సీనియర్ యక్ట్రెస్ తో ఆ పాత్ర చేయించుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి విషయం గురించే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కొంతమంది పాపులర్ హీరోయిన్లు పలు హిట్ సినిమాల్లో మంచి పాత్రలు దొరికితే మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు.. వాళ్ళు మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:
1) రాశి :
సీనియర్ స్టార్ హీరోయిన్ రాశిని రంగస్థలం లో రంగమ్మత్త పాత్రకి అడిగారు. కానీ ఆమె చేయలేదు. అందుకే అనసూయతో ఆ పాత్రను చేయించారు.
2) శ్రీదేవి :
బాహుబలి లో శివగామి పాత్రకు మొదట శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.దీంతో రమ్యకృష్ణ ఆ పాత్రలో నటించారు. నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్రకు కూడా శ్రీదేవిని సంప్రదించారు. అందుకు ఆమె నొ చెప్పడంతో ఆ పాత్రను ‘సీతామాలక్ష్మి’ ఫేమ్ తాళ్ళూరి రామేశ్వరి పోషించారు.
3) జయసుధ :
నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్రకు ఈమెను కూడా అడిగారు. ఈమె ఓకె చెప్పడం కూడా జరిగింది.కాల్ షీట్లు సర్దుబాటు చేయలేక ఆమె చేయలేక తప్పుకున్నారు
4) లయ :
చెన్న కేశవ రెడ్డి సినిమాలో చెల్లెలి పాత్రకు ఈమెను అడిగారు. కానీ స్టార్ హీరోకి చెల్లిగా చేయడం ఏంటి.. తెలుగమ్మాయిలు హీరోయిన్ గా పనికిరారా అంటూ ఎమోషనల్ అయ్యి తప్పుకుంది. తర్వాత అరవింద సమేత లో ఎన్టీఆర్ కు తల్లి పాత్రకు ఈమెను అడిగారు. అది నచ్చక ఈమె చేయను అని చెప్పేసింది.
5) విద్యా బాలన్ :
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సీత పాత్రకు ఈమెను సంప్రదించారు. కానీ ఈమె నొ చెప్పింది.
6) విజయశాంతి :
రాజా ది గ్రేట్ సినిమాలో తల్లి పాత్రకు ఈమెను సంప్రదించారు. కానీ ఈమె నొ చెప్పడంతో రాధిక గారిని తీసుకున్నారు.
7) గ్రేసీ సింగ్ :
శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లి పాత్రకు సంతోషం హీరోయిన్ అయిన గ్రేసీ సింగ్ ను సంప్రదించారు. కానీ ఈమె నొ చెప్పింది. దీంతో సుకన్య ని తీసుకున్నారు.
8) మీనా :
నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు మీనా ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా అది రమ్యకృష్ట కి దక్కింది.
9) రేఖ:
నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్రకు రేఖ ని కూడా సంప్రదించారు. కానీ ఆమె నొ చెప్పింది.
10) జయప్రద :
మహర్షి సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకి జయప్రద గారిని మొదట సంప్రదించారు. కానీ ఫైనల్ గా జయసుధ గారే చేయడం జరిగింది.