Allu Arjun: గత 10 సినిమాల నుండి అల్లు అర్జున్ సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన పుష్ప 2 (Pushpa 2: The Rule)  రేపు అనగా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ.600 కోట్లు వచ్చాయి నిర్మాతలకి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే ఆసక్తి అందరిలో ఉంది. అది పక్కన పెట్టేసి అల్లు అర్జున్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో చూద్దాం రండి:

Allu Arjun

1) బద్రీనాథ్ :

అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు వి.వి.వినాయక్ (V. V. Vinayak) కాంబినేషన్లో ‘బన్నీ’ (Bunny) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘బద్రీనాథ్’ (Badrinath) . ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక రూ.35 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం రూ.26 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

2) జులాయి :

అల్లు అర్జున్(Allu Arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా ‘జులాయి’ (Julayi). ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ (S. Radha Krishna), డీవీవీ దానయ్య (D. V. V. Danayya) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. రూ.33.79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.42.65 కోట్ల షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది.

3) ఇద్దరమ్మాయిలతో :

అల్లు అర్జున్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో ‘దేశముదురు’ (Desamuduru) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’ (Iddarammayilatho). బండ్ల గణేష్ (Bandla Ganesh Babu) ఈ చిత్రానికి నిర్మాత. మొదటి షోతో ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. ఇక రూ.38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.31.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

4) రేసు గుర్రం :

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్లో రూపొందిన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘రేసు గుర్రం’ (Race Gurram). నల్లమలపు శ్రీనివాస్ (Nallamalupu Bujji) ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.38 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.59 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది

5) సన్ ఆఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) :

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జూలాయి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన ఈ సినిమాని ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. రూ.52 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.50 కోట్ల షేర్ ను రాబట్టి అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

6) సరైనోడు (Sarrainodu) :

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇక రూ.53.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.73.87 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది

7) డిజె (Duvvada Jagannadham) :

అల్లు అర్జున్, హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. రూ.81 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.72 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది

8) నా పేరు సూర్య (Naa Peru Surya, Naa Illu India) :

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.81 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.49 కోట్ల షేర్ ను రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది

9) అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) :

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.160.37 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది

10) పుష్ప(ది రాజ్(Pushpa) ) :

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. రూ.146 కోట్ల బ్రే క్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.165.15 కోట్ల షేర్ ను రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది.

పుష్ప 2 ది రూల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus