Raj-Koti: ‘యముడికి మొగుడు’ టు ‘రిక్షావోడు’ చిరు, రాజ్ – కోటి కాంబోలో వచ్చిన సినిమాల లిస్ట్..!

రాజ్- కోటి.. ఒకప్పుడు వీరి మ్యూజిక్ తో టాలీవుడ్ ను షేక్ చేసి పడేశారు. ఈ స్నేహితుల మ్యూజిక్ ను మంచి బ్రాండ్ గా భావించే దర్శకనిర్మాతలు అనేక మంది ఉన్నారు. 180 కు పైగా సినిమాలకు కలిసి పనిచేశారు. ప్రళయ గర్జన(1983)తో మొదలైన వీరి సినీ ప్రస్థానం హలో బ్రదర్ వంటి హిట్‌ సినిమాల వరకు సాగింది. అయితే మధ్యలో వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. అందుకే విడిపోయి ఎవరికి వారు సినిమాలు చేసుకున్నారు. అయితే మే 21న రాజ్ గుండెపోటుతో మరణించారు. దీంతో ఎక్కువగా అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన కోటి వార్తల్లో నిలిచాడు. స్నేహితుడు మరణవార్తని విని కోటి చాలా ఎమోషనల్‌ అయ్యారు. ‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా.

ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఈవెంట్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యల ఉన్నట్టు రాజ్ నాకు చెప్పలేదు. అలాంటిది హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. రాజ్- కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. అది నాకు ఎంతో ఆనందంగా అనిపించేది. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని’ అంటూ కోటి కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే రాజ్ – కోటి లకు టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి వీళ్ళతో ఎక్కువ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఈ క్రమంలో రాజ్-కోటి లతో చిరు చేసిన సినిమాలు ఏంటో.. వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) యముడికి మొగుడు :

1988 లో వచ్చిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ – కోటి అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

2) ఖైదీ నెంబర్ 786 :

చిరంజీవి హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా 1988 లోనే వచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. రాజ్ – కోటి అందించిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ‘గువ్వా గోరింకతో’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.

3) త్రినేత్రుడు :

1988 లోనే చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి కూడా రాజ్ – కోటి సంగీతం అందించారు. ఇది చిరంజీవికి 100వ చిత్రం. అయితే ఈ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. పాటలు మాత్రం బాగానే ఉంటాయి.

4) లంకేశ్వరుడు :

దాసరి నారాయణరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ 1989 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కూడా రాజ్ – కోటి సంగీతం అందించారు. అయితే ఈ సినిమా జస్ట్ యావరేజ్ గా ఆడింది. అయితే ’16 ఏళ్ళ వయసు’ అనే పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

5) కొదమసింహం :

చిరంజీవి నటించిన కౌబాయ్ మూవీ ఇది. కె.మురళీమోహన్రావు దర్శకుడు. సినిమా అయితే యావరేజ్ గా ఆడింది. అయితే రాజ్- కోటి మ్యూజిక్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది. ‘స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్’ అనే పాట ఈ సినిమాలోనిదే.

6) రాజా విక్రమార్క :

చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ రాజ్ – కోటి మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు.

7) ముఠామేస్త్రి :

చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి రాజ్- కోటి అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. ‘అంజనీ పుత్రుడా’ ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ అనే పాటలు చార్ట్ బస్టర్స్ అనిపించుకున్నాయి.

8) మెకానిక్ అల్లుడు :

చిరంజీవి – అక్కినేని నాగేశ్వరరావు లు కలిసి నటించిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది కానీ రాజ్ – కోటి మ్యూజిక్ ఆకట్టుకుంది.

9) రిక్షావోడు :

చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే రాజ్ – కోటి సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

10) అబు బాగ్దాద్ గజదొంగ:

అబు బాగ్దాద్ గజదొంగ చిత్రానికి రాజ్ – కోటి సంగీత దర్శకులుగా ఎంపికయ్యారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. మధ్యలో వీళ్ళను మార్చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అటు తర్వాత ‘స్నేహం కోసం’ చిత్రానికి కూడా రాజ్ – కోటి సంగీత దర్శకులుగా చేయాలి.. కానీ చివర్లో ఎస్.ఎ.రాజ్ కుమార్ ను ఫైనల్ చేశారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus