ఇళయ రాజా, దర్శకుడు వంశీ కలయికలో మొత్తం ఎన్ని సినిమాలొచ్చాయో తెలుసా..!

మ్యాస్ట్రో ఇళయ రాజా.. దర్శకుడు వంశీ.. వీరిద్దరిదీ క్రేజీ కాంబినేషన్.. వీళ్ల కలయికలో ఎన్నో మరపురాని పాటలొచ్చాయి.. పాటలు హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే.. కానీ వంశీ సినిమాకి ఇళయ రాజా పని చేస్తున్నారంటేనే ఆ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అనేలా ఉండేది ఈ కాంబో.. ముందుగా 1984లో ‘సితార’ మూవీతో వంశీ – రాాజాల సినీ ప్రయాణం ప్రారంభమైంది.. కేవలం పాటలనే కాదు నేపథ్య సంగీతంతోనూ సినిమాకి ప్రాణం పోసేవారాయన..

‘సితార’, ‘అన్వేషణ’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘ఆలాపన’, ‘లేడీస్ టైలర్’, ‘మహర్షి’; ‘చెట్టుకింద ప్లీడర్’, ‘డిటెక్టివ్ నారద’ సినిమాలు దర్శకుడు వంశీ – సంగీత దర్శకుడు ఇళయ రాజా కలయికలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు.. వీటిలోని పాటల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇప్పుడు విన్నా ఫ్రెష్‌గా అనిపిస్తాయి.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా మోహన్ బాబు నటించిన ‘డిటెక్టివ్ నారద’.. ఆ సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. మళ్లీ కలిసి పని చేయలేదు..

దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆర్యన్ రాజేష్ హీరోగా వంశీ తీసిన ‘అనుమానాస్పదం’ తో తిరిగి కలిశారు కానీ సినిమా ఘోర పరాజయం పాలైంది.. ఇక ‘డిటెక్టివ్ నారద’ తర్వాత తన సినిమా కోసం దర్శకుడు వంశీ సంగీత దర్శకుడిగా మారడం విశేషం.. రాజేంద్ర ప్రసాద్, వాణీ విశ్వనాథ్ జంటగా వంశీ తీసిన కామెడీ పిక్చర్ ‘జోకర్’.. పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ మీద గొట్టిముక్కల పద్మారావు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ మ్యూజిక్ కంపోజ్ చేశారు..

కానీ సినిమా పెద్దగా ఆడలేదు.. ఇక సంగీతానికి మాత్రం ఏం పేరొస్తుంది?.. దీంతో మనకి రాని పని ట్రై చేయకూడదని నిర్ణయించుకుని అప్పటినుండి ఇతర సంగీత దర్శకులను పెట్టుకోవడం మొదలు పెట్టారు వంశీ.. అలా ఆయన కెరీర్‌లో మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిలింగా రాజేంద్ర ప్రసాద్ ‘జోకర్’ నిలిచింది..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus